Breaking News

ఆడపిల్లలకు విద్య, జీవన నైపుణ్యాలు అందాలి

-బాలికా విద్యాభివృద్ధికి ‘ప్రాజెక్టు కస్తూరి’ కార్యక్రమం ప్రారంభం
-పాఠశాల విద్యాశాఖ కమీషనర్ ఎస్.సురేష్ కుమార్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ప్రతి అమ్మాయి చదువుకునేలా అందరూ బాధ్యత వహించాలని, ఆడపిల్లలు అన్ని రంగాల్లో రాణించేలా తర్పీదునివ్వాలని పాఠశాల విద్యాశాఖ కమీషనర్ & సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు ఎస్.సురేష్ కుమార్ అన్నారు. సమగ్ర శిక్షా, రూమ్ టూ రీడ్ సంయుక్తాధ్వర్యంలో బాలికా విద్యాభివృద్ది కోసం ‘ప్రాజెక్టు కస్తూరి’ కార్యక్రమాన్ని మంగళవారం విజయవాడలోని ఓ హోటల్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా కమీషనర్ ప్రసంగిస్తూ చదువు జీవితానికి ఒక వారధి అని, అందుకోసం ప్రతి విద్యార్థికి చదివే నైపుణ్యం, సృజనాత్మకత, జీవన నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసం వంటివి పెంపొందించడానికి కృషి చేయాలని అన్నారు. చదువు ఉద్యోగం కోసమే కాకుండా జ్ఞాన సముపార్జన కోసం కూడా వినియోగించుకోవాలని తెలిపారు. చదివిన పుస్తకాలను సమీక్షించేలా పిల్లలకు తర్ఫీదునివ్వాలని, జీవితం పట్ల సానూకులతగా ఉండేలా శిక్షణ ఇవ్వాలని కోరారు.

6 కేజీబీవీల్లో ప్రయోగం
రూమ్ టూ రీడ్ కార్యక్రమాన్ని తొలుత కడప జిల్లాలో చాపాడు, దువ్వూరు, ఖాజీపేట. మైదకూరు, వల్లూరు, పెండ్లిమర్రి కేజీబీవీల్లో 6,7,8 తరగతుల విద్యార్థులకు ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని అన్నారు. ఇందులో భాగంగా ఆత్మవిశ్వాసం, భావోద్వేగాలను వ్యక్తపరచడం, నియంత్రించడం, సహానుభూతి, స్వీయనియంత్రణ, విమర్శనాత్మక ఆలోచనా ధోరణి, నిర్ణయాలు తీసుకోవడం, పట్టుదలగా పని చేయడం, భావ ప్రసారం, సమస్యలను సృజనాత్మకంగా పరిష్కరించడం, సంబంధ బాంధవ్యాలను ఏర్పరుచుకోవడం తదితర పది జీవన నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వనున్నామని తెలిపారు. రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయ, విద్యార్థి కరదీపికలను ఆవిష్కరించారు. అనంతరం రూమ్ టూ రీడ్ రాష్ట్ర ప్రతినిధి కె.నరసింహాచారి మాట్లాడుతూ ప్రతి అమ్మాయికి 12వ తరగతి పూర్తి అయ్యేసరికి జీవన నైపుణ్యాలు మెరుగుపరచుకొని, తద్వారా జీవితంలో క్లిష్ట పరిస్థితుల్లో మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్షా ఎస్ఏపీడీ బి.శ్రీనివాస రావు , పాఠశాల విద్య జాయింట్ డైరెక్టర్ (సర్వీసెస్) మువ్వా రామలింగం , కేజీబీవీ సెక్రటరీ జి.నాగమణి , రూమ్ టూ రీడ్ ప్రొగ్రామ్ ఆఫీసర్ డి.సదాశివరెడ్డి, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, కడప జిల్లా కేజీబీవీల ప్రిన్సిపాళ్లు, సీఆర్టీలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *