Breaking News

పోలీస్, వివిధ శాఖల అధికారులు, సిబ్బందికి కలెక్టర్ అభినందనలు…

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త:
మూలా నక్షత్రం రోజున అమ్మవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేనివిధంగా చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు తెలిపారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ ఇంద్రకీలాద్రి మీడియా పాయింట్ వద్ద విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అక్టోబర్ 2వ తేదీ మూలా నక్షత్రం రోజున అమ్మవారు సరస్వతి దేవి అలంకారంలో దర్శనమిస్తారని, ఆ రోజున లక్షన్నర నుండి రెండు లక్షల వరకు భక్తులు అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉందన్నారు. ఇందుకు అనుగుణంగా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. రెండో తేదీ తెల్లవారుజాము రెండు గంటల నుండి మూడు గంటల మధ్య వివిఐపీలు, గౌరవ హైకోర్టు న్యాయమూర్తులు దర్శనం కోసం కేటాయించడం జరిగిందన్నారు. తెల్లవారుజాము మూడు గంటల నుండి భక్తులందరికీ ఉచిత సర్వదర్శనం కల్పించడం జరుగుతుందన్నారు. తెల్లవారుజాము మూడు గంటల అనంతరం వీవీఐపీలకు, వృద్ధులకు, వికలాంగులకు ఎటువంటి దర్శనాలు ఆరోజు ఉండవని కలెక్టర్ స్పష్టం చేశారు. శరన్నవరాత్రులు ప్రారంభించిననాటి నుండి నేటి వరకు ఎటువంటి సంఘటనలు జరగకుండా సజావుగా శరన్నవరాత్రి ఉత్సవాలు జరగడానికి నిరంతరం పనిచేస్తున్న పోలీస్, వివిధ శాఖల అధికారులు, సిబ్బందికి కలెక్టర్ అభినందనలు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *