విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకు రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి, దుష్ట శక్తుల మీద దైవశక్తి అంతిమ విజయం సాధిస్తాయని.. మహిషాసురుడిపై దుర్గామాత విజయం ప్రపంచానికి చాటిందన్నారు. స్త్రీ శక్తి ఏమిటో లోకానికి తెలిసివచ్చిందన్నారు. దుర్గమ్మ తల్లి ఆశీస్సులతో రాష్ట్రంలో సర్వమత సమానత్వం, సౌభ్రాతృత్వం వర్థిల్లుతున్నాయని మల్లాది విష్ణు అన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రం అన్నిరంగాల్లో దేశంలోనే అత్యంత వేగంగా పురోగతి సాధిస్తుందని తెలిపారు. కనకదుర్గమ్మ అనుగ్రహంతో నియోజకవర్గంలో ప్రభుత్వ పాలన, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అద్భుతంగా అందుతున్నాయని మల్లాది విష్ణు అన్నారు. ఆ ఆదిపరాశక్తి అనుగ్రహంతో ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్యర్యాలు, సకల సిరి సంపదలు కలగాలని.. రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుండాలని కోరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అజేయశక్తిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జగన్మాత చల్లని దీవెనలు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు.
Prajavartha Online Telugu News