Breaking News

దుర్గమ్మని దర్శించుకున్నశాసనసభ్యులు కొడాలి వెంకటేశ్వరరావు

ఇంధ్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త :
శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం మహిషాసుర మర్దని అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్న కనకదుర్గమ్మ అమ్మవారిని మాజీ మంత్రి, శాసనసభ్యులు కొడాలి వెంకటేశ్వరరావు (నాని) దర్శించుకున్నారు. ఆలయ ఇవో డి. భ్రమరాంబ స్వాగతం పలికారు. దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనం అమ్మవారి ప్రసాదం అందజేశారు. అనంతరం మీడియా పాయింట్ నుండి మాజీ మంత్రి, శాసనసభ్యులు కొడాలి వెంకటేశ్వరరావు (నాని) మాట్లాడుతూ
సామాన్య భ‌క్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దుర్గ‌మ్మ‌ను ద‌ర్శ‌నం చేసుకొనేలా చేసిన ఏర్పాట్లు బాగున్నాయ‌ని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి క్ర‌మం త‌ప్ప‌కుండా అమ్మ‌వారికి ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పిస్తున్నార‌న్నారు. రాష్ట్ర అభివృద్ధికి అహ‌ర్నిశ‌లు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రికీ మంచి జ‌రిగేలా చూడాల‌ని దుర్గ‌మ్మ‌ను ప్రార్థించిన‌ట్లు శాసనసభ్యులు అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *