Breaking News

వైదిక ధర్మ ప‌రిరక్షణకు కృషి

-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణు
-మల్లాది వేంకటసుబ్బారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో వేద పండితులకు ఘన సత్కారం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వేద పండితులకు రాష్ట్ర ప్రభుత్వం సముచిత ప్రాధాన్యతను ఇస్తోందని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. దేవీ శరన్నవరాత్రులను పురస్కరించుకుని లబ్బీపేటలోని స్వగృహము నందు మంగళవారం మల్లాది వేంకటసుబ్బారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలువురు వేద పండితులను ఘనంగా సత్కరించారు. సనాతన హిందూ ధర్మ ప్రచారం, వైదిక ధర్మాన్ని పరిరక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృతనిశ్చయంతో పనిచేస్తున్నారని ఈ సందర్భంగా మల్లాది విష్ణు వెల్లడించారు. వేదాల పరిరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవడంతో పాటు.. ఆలయాల్లో వేద పారాయణంపై మరింత దృష్టి సారిస్తున్నట్లు వివరించారు. భార‌తీయ స‌నాత‌న సంస్కృతికి వేద‌మే మూల‌మ‌ని, వేదాలను గౌరవించుకునే చోట సాక్షాత్తు అమ్మవారు కొలువై ఉంటారని మల్లాది విష్ణు పేర్కొన్నారు. ప్రాథమిక గ్రంథాలైన మన వేదాలు, శాస్త్రాలను అధ్యయనం చేయడం ద్వారా వందలాదిమంది పండితులు నేటికీ ఆ సంప్రదాయ జ్ఞానాన్ని సజీవంగా ఉంచుతున్నారన్నారు. అటువంటి వేద పండితులను సత్కరించుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఆ జగన్మాత కృపా కటాక్షాలు రాష్ట్ర ప్రభుత్వంపై ఎల్లవేళలా ఉండాలని కాంక్షించారు. సకాలంలో వర్షాలు విస్తారంగా కురిసి, పాడి పంటలతో రైతులు, అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు.

టీటీడీ ప్రవచనకర్త కుప్పా శివ సుబ్రహ్మణ్య అవధాని మాట్లాడుతూ.. అమ్మవారి ప్రాశస్త్యాన్ని వివరించారు. ఆ ఆదిపరాశక్తి దుర్గాదేవిగా ఇంద్రకీలాద్రిపై అవతరించడం మనందరికీ గర్వకారణమన్నారు. ఈ కొండపై అర్జునుడు తపస్సు చేసి పాశుపతాస్త్రాన్ని పొందారని వెల్లడించారు. జగన్మాతకు అత్యంత ప్రీతికరమైన మహానవమి రోజు వేదపఠనం నిర్వహించడం, వేద పండితులను సత్కరించుకోవటం శుభకరమన్నారు. అనంతరం మల్లాది విష్ణు దంపతుల చేతులమీదుగా పలువురు ఘనాపాటిలను, వేద పండితులను దుశ్శాలువలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మల్లాది వేంకటసుబ్బారావు ఫౌండేషన్ వ్యవస్థాపకులు మల్లాది బాలాత్రిపుర సుందరమ్మ గారు, మల్లాది రాజేంద్ర, మల్లాది శ్రీనివాస్ (బుల్లి), యల్లాప్రగడ సుధీర్ బాబు, జె.కె. సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *