-కలెక్టర్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి ఒక్కరికి మానసిక ప్రశాంతత ఎంతో అవసరమని మానసిక ఆరోగ్యం ఉంటే దేనినైన సాధించవచ్చునని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అన్నారు.
ప్రపంచ మానసిక ఆరోగ్య వారోత్సవాల సందర్భంగా ఇండియన్ సైక్రియాటిక్స్ సోసైటీ ఆధ్వర్యంలో మానసిక ఆరోగ్య ప్రాధాన్యతను గుర్తిస్తూ రూపొందించిన వాల్ పోస్టర్‌ను గురువారం జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు ఆయన కార్యాలయంలో ఆవిష్కరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మానసిక ఆరోగ్యం ఎంతో అవసరమన్నారు. కొందరులో పుట్టుకతో మానసిక వ్యాధి లక్షనాలు ఉన్నప్పటికి మరి కొందరిలో మారుతున్న కాలానికి అనుగుణంగా ఒత్తిడికి లోనై మానసిక సమస్యలను ఎదుర్కొంటున్నారన్నారు. మానసిక సమస్యలను నివారించి ఆరోగ్య వంతమైన జీవితాన్ని గడిపేలా ప్రజలను చైతన్యవంతులను చేయవలసి ఉందన్నారు. శరీరక మానసిక ఆరోగ్యలు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయన్నారు. మానసిక ఆరోగ్యం శారీరక ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ శరీరక, మానసికంగా దృడంగా ఉండేలా చూసుకోవాలన్నారు. తగిన మొతాదులో పౌష్టికాహారం, వ్యాయామం, ఉద్రేకాలకు లోనుకాకుండా మనసును దృడంగా ఉంచుకోవాలన్నారు. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందనే విషయాన్ని బలంగా నమ్మాలన్నారు. తద్వారా ఆందోళన దూరమవుతుందన్నారు. క్లిష్టమైన సమస్యలు వచ్చిన్నప్పుడు అధైర్యపడకుండా ధైర్యంగా పరిష్కరించుకోవడం, ఆందోళన చెందకుండా మనసును పదిలంగా ఉంచుకోవడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుందని కలెక్టర్ అన్నారు. ఇటీవల వృద్ధులతో పాటు మద్య వయస్కులు కూడా మానసిక వ్యాధులకు గురవుతున్నారని వీరిలో ఎక్కువగా ఆందోళన నిద్రలేమి వంటి ఆనారోగ్య సమస్యలతో బాదపడటం జరుగుతుందన్నారు. ఏ వయస్సు వారైనా మానసిక ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే సైక్రియాటిస్టును సంప్రదించాలని కలెక్టర్ డిల్లీరావు అన్నారు.
ప్రముఖ మానసిక వైద్య నిపుణులు ఇండ్ల రామసుబ్బరెడ్డి మాట్లాడుతూ మానసిక చికిత్స కేంద్రాలకు వచ్చే ప్రతీ 100 మందిలో 25 మంది వృద్దులు ఉంటున్నారన్నారు. వీరిలో ఎక్కువగా డిప్రెషన్ నిద్రలేకపోవడం ఆందోళన వంటి ఆనారోగ్య సమస్యలు ఉంటున్నాయన్నారు. వృద్దాప్యంలో మానసిక రుగ్మతలు దరిచేరకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో మానసిక వైద్యులు డా.రాధికరెడ్డి, డా. విశాల్ ఇండ్ల, డా. కృష్ణదాస్, డా. ఉదయలక్ష్మి, డా. శుభమ్ గౌతమ్‌లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News