Breaking News

జిల్లాలో 112 సచివాలయాలలో ఆధార్ కేంద్రాలు : జిల్లా కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ప్రస్తుతం సచివాలయాలలో ఉన్న 87 ఆధార్ కేంద్రాలతో పాటు మరో 25 ఆధార్ కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయని తప్పులకు తావులేని ఆధార్ అందించాలే వుండాలని జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి అన్నారు. శుక్రవారం మద్యాహ్నం జిల్లాకు చేరిన 25 ఆధార్ నమోదు ల్యాప్ టాప్ లతో పాటు 12 అనుసంధాన పరికరాలను జిల్లా కలెక్టర్ సచివాలయ సిబ్బందికి అందించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలకు, పాస్ పోర్ట్ వంటి అనేక పథకాలకు ఆధార్ కార్డు ప్రాముఖ్య తెలిసిందేనని అన్నారు. ప్రభుత్వ పథకాల లబ్ది అందాలంటే ఆధార్ అవసరమని , స్పందనలో ఆదార్ వల్ల పథకాలు అందలేదని వినతులు వస్తున్నాయని అన్నారు. ఆధార్ నమోదు , సరిదిద్దే టప్పుడు కచ్చితంగా జన్మించిన తేది , పేరు , ఊరు వంటివి కొద్ది సేపు ఆలస్యమైనా ఒకటికి రెండు సార్లు చూసి ఆన్ లైన్ నమోదు చేయాలని అన్నారు. తప్పులు లేని ఆధార్ అందింస్తే ప్రజలకు మంచి చేసిన వారవుతారని శ్రద్ద పెట్టి పని చేయాలని, ఆదార్ లో తప్పులున్నాయని జిల్లాలో ఎ ఒక్కరు స్పందన కార్యక్రమంలో అర్జీలు రాకూడని అన్నారు. ఈ కార్యక్రమంలో డి.ఎల్.డి.ఓ. సుశీలా దేవి, సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *