Breaking News

ప్రజలకు చేరువగా సచివాలయ వ్యవస్థ పనిచేస్తుంది…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలకు చేరువగా సచివాలయ వ్యవస్థ పనిచేస్తుందని జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ నుపూర్‌ అజయ్‌ అన్నారు. కంచికచర్ల మండలంలో మంగళవారం జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ నుపూర్‌ అజయ్‌ కంచికచర్ల గ్రామం 1,3, గ్రామ సచివాలయాలను తనిఖీ చేశారు. గ్రామంలోని అంగన్వాడి సెంటర్‌11ను, కంచికచర్ల గ్రామానికి బైపాస్‌లైన్‌కి సంబంధించి జరుగుతున్న భూ సేకరణ పనులను పరిశీలించారు. పరిటాలలోని ఫైనల్‌ ఆర్‌ ఓ ఆర్‌ వెరిఫికేషన్‌ ప్రాసెస్‌ ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జాయింట్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజలు జిల్లా కేంద్రానికి వెళ్లకుండా వారి గ్రామాల వద్ద సమస్యలను పరిష్కరించే విధంగా సచివాలయ వ్యవస్థ పనిచేస్తుందని ఈ మేరకు సచివాలయ ఉద్యోగులు పారదర్శకంగా పనిచేయాలని ఆదేశించామని జాయింట్‌ కలెక్టర్‌ తెలిపారు. అంగన్‌వాడి కేంద్రాల్లో చిన్నారులకు నాణ్యమైన ఆహారం అందించాలని సూచించామన్నారు. కంచికచర్ల గ్రామానికి సంబంధించి బైసాస్‌ లైన్‌ లో భూములకు సంబంధించి లబ్దిదారులకు నష్టపరిహారాన్ని రెండు నెలల్లో అందించి సంవత్సరంలోగా బైసాప్‌ పనులు పూర్తి చేస్తామన్నారు. రీ సర్వేలో భాగంగా 50 శాతం హక్కు పత్రాలు వచ్చాయని, రీసర్వే పనుల కూడా పరిశీలిస్తున్నామన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండేలా కంచికచర్లలో ఆధార్‌ సెంటర్‌ కూడా ప్రారంభించడం జరిగిందని జాయింట్‌ కలెక్టర్‌ నుపూర్‌ అజయ్‌ అన్నారు. జాయింట్‌ కలెక్టర్‌ వెంట కంచికచర్ల మండల తహాసిల్దారు వి రాజకుమారి, నేషనల్‌ హైవే సర్వేర్లు, పంచాయతీ సెక్రటరీలు రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అధికారులందరూ ఫీల్డ్‌లోనే ఉండాలి

-వర్షపు నీరు నిలిచిపోవడానికి కారణాలను గుర్తించి వెంటనే పరిష్కరించాలి -విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *