Breaking News

సకాలంలో అర్జీలు పరిష్కరించాలి… :జాయింట్ కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
పరిష్కారం కోరుతూ సమర్పించిన అర్జీలను పెండింగ్ లో ఉంచకుండా అర్జీదారులకు సకాలంలో నాణ్యమైన పరిష్కారం ఇవ్వాలని జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఆర్. మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్లో జరిగిన స్పందన కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చిన ప్రజల వద్ద నుంచి డీఆర్వో ఎం. వెంకటేశ్వర్లు, డీఎంఅండ్ హెచ్ఓ జీ.గీతాబాయి, ముడా డిప్యూటీ కలెక్టర్ సరళ లతో కలసి ఆయన అర్జీలు స్వీకరించారు.
అనంతరం జాయింట్ కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ పరిష్కారం కోరుతూ అర్జీలను సమర్పించిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా అధికారులు సరైన పరిష్కారం చూపాలని అన్నారు. రీ ఓపెనెడ్ అర్జీల వరకు తీసుకురాకుండా మొదటి సారే నాణ్యమైన పరిష్కారం చూపే విధంగా అధికారులు కృషి చేయాలన్నారు. మొత్తంగా 155 అర్జీలు వచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు.
స్పందన అర్జీలు:
1. పెడన మండలం, మడక గ్రామం సమీపంలో గల రామరాజుపాలెం చానెల్ గట్టునుంచి అదే గ్రామానికి చెందిన కొంత మంది అక్రమంగా గట్టును తవ్వి మట్టిని తరలించుకుపోతున్నారని, దీనిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని అదే గ్రామానికి కుక్కల రాంబాబు అర్జీ సమర్పించారు.

2. పేదలందరికీ ఇళ్ళు పథకంలో భాగంగా భూసేకరణ చేపట్టిన స్థలానికి, తాను ఇతరుల నుంచి కొన్న ఆ భూమికి నష్టపరిహారం ఇప్పించవలసిందిగా బాపులపాడు మండలం, దండగుంట్ల గ్రామానికి చెందిన పిన్నింటి ఇమ్మానుయేలు అర్జీ ఇచ్చారు.

3. పమిడిముక్కల మండలం, మంటాడ గ్రామంలో గత రెండు సంత్సరాలుగా వీధి దీపాలు పనిచేయడం లేదని, దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేదని, తగు చర్యలు తీసుకోవాలని ఆ గ్రామానికి చెందిన పులి వాసు దేవరావు అర్జీ ద్వారా విన్నవించారు.

4. బాపులపాడు మండలం, మడిచర్ల గ్రామంలో చెరువులు, స్మశానవాటికను అక్రమార్కులు ఆక్రమించుకున్నారని, దీనిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని అదే గ్రామానికి చెందిన గొరిపర్తి నాగరాజు అర్జీ సమర్పించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *