Breaking News

సీపీఐ సభ్యుల బలం పెంపుపై దృష్టి…

-ఆరెస్సెస్‌-బీజేపీతో దేశానికి ప్రమాదం
-ప్రజాస్వామ్యం, మానవ హక్కుల ఉల్లంఘన
-బీజేపీకి ప్రత్యామ్నాయంగా కూటమి
-బలమైన శక్తిగా ఎదిగేందుకు సీపీఐ కృషి
-భావజాలంగల ప్రాంతీయ పార్టీలు ఐక్యమవ్వాలి
-3వ రోజు మహాసభల్లో 8 తీర్మానాల ఆమోదం
-రాజ్యసభలో సీపీఐ ప్రతిపక్ష నేత, ఎంపీ వినయ్‌ విశ్వం వెల్లడి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాబోయే రోజుల్లో పార్లమెంట్‌లో సీపీఐ సభ్యుల బలం పెంపుపై దృష్టి సారించామని రాజ్యసభలో సీపీఐ ప్రతిపక్ష నేత, ఎంపీ వినయ్‌ విశ్వం వెల్లడిరచారు. సీపీఐ 24వ జాతీయ మహాసభల్లో ప్రధానంగా పార్టీ బలోపేతంపైన గల మార్గాలపై అర్థవంతమైన చర్చ సాగిందన్నారు. ఆ దిశగా పార్టీ సభ్యత్వ నమోదుకు కృషి చేస్తున్నామన్నారు. విజయవాడ గురుదాస్‌ దాస్‌ గుప్తా ప్రాంగణం (ఎస్‌ఎస్‌ కన్వెన్షన్‌) మీడియా పాయింట్‌ వద్ద సోమవారం వినయ్‌ విశ్వం మాట్లాడుతూ, ఆరెస్సెస్‌ కనుసన్నల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేకంగా విధానాలతో దేశానికి పెనుప్రమాదం ఏర్పడిరదని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ప్రజాస్వామ్యం లౌకిక వాదం పరిరక్షణ కోసం సీపీఐ కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. బీజేపీ పాలనలో ప్రజాస్వామ్యం, మానవ హక్కులు పూర్తిగా హరించుకుపోయాయని విమర్శించారు. బీజేపీకి ప్రత్యామ్నాయంగా వామపక్ష, లౌకిక ప్రజాతంత్ర శక్తులను కలుపుకుని దేశంలో ఒక బలమైన శక్తిగా ఎదిగేందుకు సీపీఐ కృషి చేస్తోందన్నారు. అదే సమయంలో లౌకిక భావజాలంగల ప్రాంతీయ పార్టీలు సమైక్యంగా ముందుకు సాగి, కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని పిలుపునిచ్చారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం చారిత్రాత్మకంగా నిలుస్తోందని, ఆ పోరాటంలో భాగస్వాములైన ఉద్యోగులు, కార్మికులను అభినందించారు. సీపీఐ జాతీయ మహాసభల్లో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ తీర్మానించామన్నారు. కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థలను కారుచౌకగా కార్పొరేట్‌ వ్యక్తులకు కట్టబెడుతోందని, దానిని నియంత్రించాల్సిన అవసరముందన్నారు. అమరావతి రైతుల పాదయాత్రకు సీపీఐ సంపూర్ణ సంఫీుభావం తెలుపుతోందని వెల్లడిరచారు.

సీపీఐ జాతీయ మహాసభల్లో భాగంగా మూడో రోజు ఆమోదించిన తీర్మానాలను ఎంపీ వినయ్‌ విశ్వం వివరించారు.
సీపీఐ ఆవిర్భాÛవించి 2023కు 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సీపీఐ శత వత్సరాలను ఘనంగా నిర్వహించాలని మహాసభ తీర్మానించిందన్నారు. దీంతోపాటు మరో ఏడు తీర్మానాలను మహాసభ ఏకగ్రీవంగా ఆమోదించిందని చెప్పారు. అందులో విశాఖ ఉక్కు ప్రైవేటేకరణ వ్యతిరేకిస్తూ విశాఖ ఉక్కు ఉద్యోగులకు సంఫీుభావంగా తీర్మానం, గ్యారంటీ పెన్షన్‌ స్కీమ్‌ (ఎన్‌పీఎస్‌) రద్దు చేయడానికి, పాత పింఛను పథకాన్ని కేంద్ర ప్రభుత్వానికి పునరుద్ధరించడానికి చేసిన తీర్మానించినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర రంగాల బ్యాంకులు, బీమా మొదలైన వాటితో సహా ప్రభుత్వ రంగాన్ని, ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేయకుండా కాపాడేందుకు, ప్రభుత్వం, ప్రభుత్వ రంగాలలో ఖాళీగా ఉన్న 14 లక్షలకు పైగా పోస్టులను, వివిధ రాష్ట్ర ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న దాదాపు 8 లక్షల పోస్టులను వెంటనే భర్తీ చేయడానికి తీర్మానం, 41 ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీలను ఏడు కార్పొరేషన్లుగా మార్చే ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, ప్రభుత్వ రక్షణ పరిశ్రమపై దాడిని ఆపాలని డిమాండ్‌ చేస్తూ మహాసభల్లో తీర్మానం, దేశంలో వైద్య సంరక్షణ కోసం, దేశంలో శాంతి నిరాయుధీకరణపైన మహాసభ తీర్మానించిందన్నారు. లక్ష్యదీప్‌ పరిపాలన, ప్రజాస్వామ్య హక్కులపై దాడికి వ్యతిరేకంగా తీర్మానించామన్నారు. వాటితోపాటు జైలు నుంచి సీపీఐ నాయకులను విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ మహాసభ తీర్మానించిందన్నారు.

ముస్లిం సంఘాల నేతల అడ్డుకోవడం దారుణం: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ అమరావతి రైతుల పాదయాత్రకు మద్దతుగా వెళుతున్న ముస్లిం సంఘాల నేతలను అడ్డుకోవడం సరి కాదని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ తప్పుపట్టారు. రైతుల పాదయాత్రకు వాళ్లు మద్దతుగా వెళ్తున్నారే తప్ప, కత్తులతో వెళ్లడం లేదన్నారు. పవన్‌ కళ్యాణ్‌ యాత్రను అడ్డుకుని రగడ సృష్టించారన్నారు. వైసీపీ పోతపాలు, కృత్రిమ ఉద్యమం ఉసూరుమందంటూ ఎద్దేవా చేశారు. పవన్‌ను లక్ష్యంగా చేసి జనసేన కార్యకర్తలను రెచ్చగొట్టారని దుయ్యబట్టారు. విశాఖలో వైసీపీ సభను నిర్వహించుకుని, పవన్‌ కల్యాణ్‌ సభను మాత్రం నిలిపివేయడం అప్రజాస్వామికమని దుయ్యబట్టారు. వైసీపీ చెడుకు తలచినా, పవన్‌కే మంచి జరిగిందన్నారు. అమరావతి విషయంలో జగన్‌ మాట తప్పి మోసం చేశారని, దున్నపోతు మీద వర్షం పడిన చందంగా జగన్‌ పాలన ఉందని మండిపడ్డారు. ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *