Breaking News

37వ డివిజన్ సమస్యలు క్షేత్ర స్థాయిలో పరిశీలన…

-నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి
-డివిజన్ లో పారిశుద్ద్యాన్ని మెరుగుపరచవలెను
-కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్.

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పశ్చిమ నియోజకవర్గం లోని 37 వ డివిజన్ పరిధిలోని పలు వీధులలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్  స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్, స్థానిక కార్పొరేటర్ మండేపూడి చటర్జీ మరియు అధికారులతో కలసి సోమవారం రాత్రి 7.గం.లకు క్షేత్ర స్థాయిలో పర్యటించి స్థానికంగా గల సమస్యలను పరిశీలించి అధికారులను వివరాలు అడిగితెలుసుకొన్నారు. ఈ సందర్బంలో డివిజన్ లోని పలు వీధులలో చెత్త మరియు వ్యర్దములు ఉండుట మరియు సైడ్ డ్రెయిన్ లలో పూడిక తొలగించకపోవుట వల్ల మురుగునీరు ప్రవాహం సక్రమముగా లేకపోవుట గమనించి మెరుగైన పారిశుధ్య నిర్వహణ విధానమును అవలంభించాలని ప్రజారోగ్య అధికారులకు సూచించారు. పారిశుధ్య నిర్వహణకు సంబంధించి డోర్ టు డోర్ చెత్త సేకరణ తీరును అడిగి తెలుసుకొన్నారు. తదుపరి డివిజన్ పరిధిలో ఉన్న నగరపాలక సంస్థ వాణిజ్య సముదాయ భవనాలను మరమత్తులు చేసి వాటి పై అదనపు అంతస్తులను నిర్మించాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. అదే విధంగా వాణిజ్య సముదాయ భవనాల దగ్గర వెహికల్ పార్కింగ్ విధానం గురించి అడిగితెలుసుకొని, పార్కింగ్ ఫీజు రశీదులను పరిశిలించినారు. డివిజన్ పరిధిలో ఉన్న నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన టాయిలెట్స్ యొక్క నిర్వహణ తీరును కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్, పరిశీలించి నిర్వాహకులకు పలు ఆదేశాలు ఇచ్చారు. టాయిలెట్స్ ఎప్పటికపుడు శుభ్రపరచి సెంటేడ్ ఫెనయిల్ చల్లి పరిశుభ్రంగా ఉండునట్లుగా మరియు మరుగుదొడ్ల వద్ద నిరంతరం నీటి సరఫరా కల్పించి ప్రజలకు అందుబాటులో ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఈ సందర్బంలో టాయిలెట్స్ పరిసరాలలో మొక్కలు ఏర్పాటు చేసి పచ్చదనంతో పరిశుభ్రంగా ఉండే విధంగా చూడాలని ఆదేశించారు. ప్రజలు ఎవరైనా అభివృద్ధి పనుల విషయంలో సలహాలు, సూచనలు మరియు ఫిర్యాదులను స్థానిక సచివాలయం నందు కానీ లేదా నగరపాలక సంస్థ ఫిర్యాదుల విభాగమునకు తెలియజేసినచో అవసరమగు చర్యలు తీసుకోవటం జరుగునునని పేర్కొన్నారు. నగరపాలక సంస్థను అభివృద్ధి పదంలో నడుపుటకు అందరి సహకారం ఎంతో అవసరమని రాబోవు రోజులలో నగరాన్ని మరింతగా అభివృద్ధి పరచుటకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలియజేసారు. ఈ పర్యటనలో ఎగ్గిక్యుటివ్ ఇంజనీర్ నారాయణ మూర్తి, హెల్త్ ఆఫీసర్లు, అధికారులు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *