Breaking News

క్షేత్ర స్థాయిలో మున్సిపల్ స్టేడియం పర్యటించి అధికారులకు ఆదేశాలు…

-నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్‌ క్షేత్ర స్థాయిలో అధికారులతో కలసి పర్యవేక్షించి అక్టోబర్ 21న పోలీసు సంస్మరణ దినోత్సవం సందర్బంగా విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం లో నిర్వహింస్తూన్న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా రేపు స్టేడియం నందు జరుగబోవు పోలీస్ పెరేడ్ (ఫుల్ డ్రెస్ రిహసల్స్) కార్యకమమునకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విచ్చేయుచ్చున్న ఏర్పాట్ల పురోగతిని పరిశీలించి అధికారులను వివరాలు అడిగితెలుసుకొని పలు ఆదేశాలు ఇస్తూ, పనులు యుద్దప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. స్టేడియం లోపల వాకింగ్ ట్రాక్ మరియు వర్షం పడితే ఎక్కడ కుడా నీరు నిల్వ ఉండకుండా చేయాలనీ ఇంజనీరింగ్ అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. స్టేడియం చుట్టూ ఉన్న పారిశుధ్య నిర్వహణ విధానము మరియు సైడ్ డ్రెయిన్స్ నందలి మురుగునీటి పారుదల విధానము పర్యవేక్షించి అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. కమిషనర్  స్టేడియం జరుగుతున్న పనుల గురించి పోలీసు డిపార్టుమెంటు వారిని అడగాగా వారు నగరపాలక సంస్థ వారు చేస్తున్న పనులకు సంతృప్తి చెందినట్లు తెలిపినారు. పర్యటనలో చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.పి.రత్నావళి, ప్రాజెక్ట్ ఆఫీసర్ యు.సి.డి శకుంతల, ఎగ్గిక్యుటివ్ ఇంజనీర్ శ్రీనివాసు, ఏ.డి.హెచ్ శ్రీనివాసు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

చెత్త విభజనపై అవగాహన సదస్సు
సింగల్ యూజ్ ప్లాస్టిక్ నిషేదంలో స్వచ్చందంగా భాగస్వామ్యులు కావాలి…
నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాని నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్‌ మరియు అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) శ్రీమతి కె.వి సత్యవతి కోరారు. స్వచ్చ సర్వేక్షణ్ కార్యాక్రమాలు, చెత్త విభజన, స్వచ్చనగరం వంటి పలు అంశాలపై విద్యార్థుల్లోనూ అవగాహన కల్పించేందుకు వన్ టౌన్, సర్కిల్-1 పరిధిలోని 51వ డివిజన్ నందు శ్రీ తేలప్రోలు రాజా హై స్కూలు ప్రాంగణంలో గురువారం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించినారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రతి ఇంటిలో ఉత్పత్తి అయ్యే వ్యర్ధాలను రహదార్లపై, డ్రైయిన్లలో వేయకుండా, విభజించి పారిశుద్ద్య సిబ్బందికి ఇవ్వాలని సూచించారు. తడి, పొడి చెత్తను ఏవిధంగా విభజించాలో ఇద్దరు విద్యార్ధుల ద్వారా చేసి ప్రత్యక్షంగా విద్యార్ధులకు చూపించారు. అనంతరం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేదంపై విజయవాడను స్వచ్చ నగరంగా మార్చడానికి ప్రజలందరూ మరియు పౌరులు, విద్యార్ధులు తమ వంతు కృషి చేయాలని అన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని నిలిపివేసి క్లాత్ బ్యాగ్ లను వాడాలని సూచించారు. కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు విజయవాడ నగరపాలక సంస్థ వారి గుడ్డ సంచి లను అందజేసి వారు మరికొందరికి అవగాహన కలుగజేయలని తెలిపారు. ఈ కార్యాక్రమములో అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) కె.వి సత్యవతి, హెల్త్ ఆఫీసర్లు డా.సురేష్ బాబు, శానిటరీ సూపర్వైజర్ ఓబెస్వర రావు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, శానిటరీ సెక్రెటరీలు మరియు స్కూల్ సిబ్బంది, విద్యార్థులు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గుంటూరు నగరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం : నగర కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల (G.O.Rt.No. 1165, MA&UD Department) ప్రకారం గుంటూరు నగర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *