విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, జై ఆంధ్ర ఉద్యమంలో కీలకపాత్ర పోషించి ఉక్కు కాకాని గా పేరుగాంచిన కాకాని వెంకట రత్నం విగ్రహాన్ని విజయవాడ నగరంలో తిరిగి ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నామని తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. గురువారం కాకాని కుటుంబ సభ్యులతో కలిసి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు గారిని వారి క్యాంప్ కార్యాలయంలో కలిసిన అవినాష్ విగ్రహ ఏర్పాటు కు చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ కాకాని వెంకటరత్నం లాంటి మహనీయుల గురుంచి వారు చేసిన పోరాటాలు భవిష్యత్ తరాలకు తెలియాలని అప్పటి ప్రభుత్వం బెంజ్ సర్కిల్ వద్ద వారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారని అన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వం లో ఫ్లై ఓవర్ నిర్మించేటప్పుడు ఆయన విగ్రహాన్ని తొలగించి మరలా ఏర్పాటు చేయకుండా అవమానించారని, విగ్రహ ఏర్పాటు గురించి అడిగిన వారి కుటుంబ సభ్యుల మీద పోలీసు కేసులు పెట్టీ,దాడి చేసి అవమానించారని విమర్శించారు. నాడు తొలగించి వారిని అవమానించిన అదే తెలుగుదేశం నాయకులు నేడు మొసలి కన్నీరు కారుస్తు ఓట్ల రాజకీయం కోసమే విగ్రహ ఏర్పాటు చేయాలని కోరడం సిగ్గు చేటు అని ఎద్దేవా చేశారు. వైస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత వారి కుటుంబ సభ్యులు విగ్రహ ఏర్పాటు గురుంచి మా దృష్టికి తీసుకురాగా తక్షణమే ముఖ్యమంత్రి గారి దృష్టికి ఆ విషయం తీసుకెళ్లగా వారు వెంటనే అందుకు అవసరమైన స్థల పరిశీలన చేయాలని కలెక్టర్ ను అదేశించారని గుర్తు చేశారు.నేడు వారి కుటుంబ సభ్యులతో కలిసి కలెక్టర్ గారికి విగ్రహ ఏర్పాటు గురుంచి వినతిపత్రం అందజేయగా సానుకూలంగా స్పందించిన ఆయన వీలైనంత త్వరగా క్షేత్రస్థాయిలో స్థల పరిశీలన చేసి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు కాకాని విజయకుమార్, కాకాని తరుణ్, కోనేరు మధు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News