Breaking News

ఇచ్చిన హామీలు నెరవేర్చాలి… : బి.జె.గాంధీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఏపీ గవర్నమెంట్ కాలేజ్స్ కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బి.జె.గాంధీ మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లను మానిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం వెంటనే క్రమబద్ధీకరించాలి. ప్రభుత్వం వచ్చిన వెంటనే అమలు చేసిన 12 నెలలు రెన్యువల్ ఉత్తర్వులు తిరిగి అమలు చేయాలి-10 నెలలు రెన్యువల్ ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలన్నారు. రెగ్యులర్ ఉద్యోగులకు పెంచిన (58 సం॥ నుండి 62 సం||కు) పదవీ విరమణ వయస్సు కొంట్రాక్టు లెక్చరర్లకు వెంటనే పెంచాలన్నారు. ప్రభుత్వ కళాశాలలో 2000 సం॥ నుండి కాంట్రాక్టు లెక్చరర్లుగా ఉమ్మడి రాష్ట్రంలో నియమించబడ్డాము. అప్పటి నుండి ప్రభుత్వ కళాశాలలను కాపాడటంలోనూ మా వంతు కృషి చేస్తున్నామన్నారు. ఈ ప్రభుత్వం కూడా కేవలం కమిటీలు వేసి ఇప్పటి వరకు ఏ నిర్ణయం తీసుకోలేదు. అనేకసార్లు ప్రభుత్వం అధికారులను కలసినప్పటికీ ఫలితం. లేకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో ప్రభుత్వం పై వత్తిడి తీసుకుని రావాలని ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంట్రాక్టులెక్టర్లుగా నియమింపబడ్డ మేము తెలంగాణాలో క్రమబద్దీకరించటానికి అన్ని చర్యలు తీసుకొని వారిని క్రమబద్దీకరించటం ద్వారా వారు రెగ్యులర్ అయి ఆంధ్రప్రదేశ్ లో కాంట్రాక్టక్చరర్లుగా మిగిలిపోతామన్నారు. అంతేకాకుండా ఈ విద్యాసంవత్సరం రెన్యువల్ ఉత్తర్వులు గతంలో ఇచ్చిన విధంగా 12 నెలలు కాకుండా. | కేవలం 10 నెలలకే రెన్యువల్ ఉత్తర్వులు విడుదల చేశారు దీని వల్ల మేము డిశంబరు వరకే పనిచేస్తాము విద్యార్థులకు జనవరి, ఫిబ్రవరి నెలలు సిలబస్ పూర్తిఅయ్యి రివిజన్ చేసే సమయం. లేని విధంగా విద్యార్థులకు తీవ్ర నష్టం జరిగి ఆ ప్రభావం ప్రభుత్వ ఈ విధానం వల్ల ఎప్పుడూ జూనియర్ కళాశాలల పరీక్షా ఫలితాలపై పడుతుందన్నారు. అంతేకాకుండా ఈ వేతనాల పై ఆధారపడి జీవిస్తున్న కాంట్రాక్టు లెక్చరర్ల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడతాయన్నారు. ఒక ప్రక్క అనేక రాష్ట్రాల తోపాటు ఇటీవల ఒరిస్సా రాష్ట్రంలో కూడా 57 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించారు. అనేక సార్లు ప్రాతినిధ్యాలు చేసిన ఫలితం లేకపోవడంతో ప్రభుత్వం మీద వత్తిడి తీసుకొని రావడానికి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని మీద్వారా తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి హరినాథ రెడ్డి, జి.ఎం.దయాకర్, ఆర్.విజయ భేరి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *