Breaking News

క్షేత్ర స్థాయిలో పారిశుధ్య నిర్వహణ తీరు పరిశీలన మరియు ఎక్సెల్ ప్లాంట్ల సందర్శన

-విధులలో అలసత్వం వహించకుండా భాద్యతగా నిర్వర్తించాలి,
-కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్, బుధవారం 60వ డివిజన్ ప్రకాష్ నగర్ ప్రాంతములోని పలు వీధులలో పారిశుధ్యo మరియు అండర్ గ్రౌండ్ డ్రెయినేజి నిర్వహణ విధానమును పరిశీలించి అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. విధులలో పారిశుధ్య కార్మికులు మరియు శానిటరీ సెక్రటరీల పని తీరును పరిశీలించి, విధులకు సకాలంలో హాజరు కావాలని ఆదేశిస్తూ, కార్మికల యొక్క హాజరు వివరాలు నోటీసు బోర్డు నందు ఉంచాలని అధికారులకు సూచించారు. ప్రతి రోజు చెత్త సేకరణకు మరియు డ్రెయిన్స్ శుభ్రపరచుటకు సిబ్బంది వస్తున్నది లేనిది అడిగితెలుసుకొని ఎవరు చెత్తను వీధులలో లేదా డ్రెయిన్ లలో పడవేయకుండా చెత్త సేకరణకు వచ్చు పారిశుధ్య సిబ్బందికి అందించి పరిసరాలు అన్నియు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అదే విధంగా డివిజన్లో ఇంటింటి చెత్త సేకరణ విధానము మరియు డ్రెయిన్ నందు మురుగునీటి పారుదల తీరును పరిశీలించి అధికారులకు పలు ఆదేశాలు ఇస్తూ, డ్రెయిన్ లలో నీటి పారుదలకు అడ్డంగా ఉన్న చెత్త మరియు వ్యర్ధములను తొలగించాలని, నూరు శాతం డోర్ టు డోర్ బాస్కెట్ కలెక్షన్ జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు. తదుపరి సింగ్ నగర్ ఎక్సెల్ ప్లాంట్ నందలి ట్రాన్స్ ఫర్ స్టేషన్, చెత్త వేయింగ్ మిషన్ యొక్క పనితీరు పరిశీలించి వివరాలు అడిగితెలుసుకోనిన సందర్భంలో ఎక్సెల్ ప్లాంట్ ట్రాన్స్ ఫర్ స్టేషన్ నందలి చెత్త వాహనాలు నిలిచిపోవడం చూసి రెండొవ వేయింగ్ మిషన్ బ్రిడ్జి ఏర్పాటు చేయాలనీ, ప్లాంట్ చుట్టూ మిగిలిపోయిన ప్రహరి నిర్మాణము పనులు వేగవంతము చేయాలని, ఫోర్ లైన్ వచ్చే విధంగా రోడ్లను వేయుటకు చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. పర్యటనలో అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) కె.వి సత్యవతి, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.పి.రత్నావళి, ఎగ్గిక్యుటివ్ ఇంజనీర్ ఏ.ఎస్.ఎన్ ప్రసాద్, శానిటరీ ఇన్స్ పెక్టర్లు మరియు సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *