Breaking News

45 వార్డు వాలంటీర్ల పోస్టులను భర్తీ కు దరఖాస్తు స్వీకరణ

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము వారు జారీ చేసిన ఉత్తర్వుల అనుసరించి గుంటూరు నగరపాలక సంస్ధ పరిధిలో మొత్తం 207వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న45 వార్డు వాలంటీర్ల పోస్టులను భర్తీ చేయుటకు ది.31-10-2022న అన్ని వార్డు సచివాలయాల్లో నోటీసు బోర్డుల్లో ఖాళీగా ఉన్న వార్డు వాలంటీర్ల పోస్టుల వివరములను ప్రచురిస్తామని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐ.ఏ.యస్  ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్  మాట్లాడుతూ వార్డు వాలెంటీరు పోస్టునకు ధరఖాస్తుదారుడు, 10వ తరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై (ఆధార్ కార్డులోని పుట్టిన తేది మరియు 10 వ తరగతి సర్టిఫికేట్ లోని పుట్టిన తేదీ ఒకటై ఉండవలెను), తేది. 30-9-2022 నాటికి 18 సంవత్సరములు నిండినవారై ఉండి, 35 సంవత్సరములు మించని వారై ఉండవలెనని తెలిపారు. దరఖాస్తుదారుని ఆధార్ కార్డు చిరునామా సంబంధిత మున్సిపాలిటీ పరిధికి సంబంధించి ఉండవలెనని, ది.1-11-2022 నుండి 3-11-2022 వరకు ఆన్లైన్ ద్వారా http://40.81.241.107/APVOLUNTEER20/apVolunteer 090420201049.vt వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకొనవచ్చునని పేర్కొన్నారు. ది4-11-2022 న ఆన్ లైన్ నందు దాఖలైన దరఖాస్తులను పరిశీలించి, 5-11-2022 న మౌఖిక పరీక్షలు నిర్వహించి ఎంపిక చేయబడునని తెలిపారు. ఎంపిక కాబడిన వార్డు వాలంటీర్లు ది9-11-2022 నుండి విధుల్లోకి చేరవలసియుండునని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *