Breaking News

ఉరుసు మహోత్సవాలకు మల్లాది విష్ణుకి ఆహ్వానం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుని ఆస్థాన ‘ఎ’ హజరత్ సయ్యదినగౌసే ఆజాం కమిటీ సభ్యులు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈనెల 6 న రామకృష్ణాపురంలోని దర్గా నందు జరుగు 35వ ఉరుసు మహోత్సవాలకు విచ్చేయవలసినదిగా ఆహ్వానించారు. ఈ మేరకు ఆంధ్రప్రభకాలనీలోని జనహిత సదనములో ఆహ్వానపత్రికను అందజేశారు. కార్యక్రమానికి తప్పక విచ్చేసి అల్లాహ్ దివ్య ఆశీస్సులు అందుకోవాలని కోరగా.. హాజరవుతానని మల్లాది విష్ణు తెలియజేశారు. అనంతరం మత పెద్దలు ఇస్లాం సాంప్రదాయం ప్రకారం మల్లాది విష్ణుని ఘనంగా సత్కరించారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో జనాబ్ మహ్మద్ అతావుల్లా ఖాదరి సాహెబ్, షేక్ ఖాజా, షేక్ వహిద్, లోకేష్, దినేష్ ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *