Breaking News

వెటర్నరీ కాలనీలో కె టి ఎం షోరూం ప్రారంభం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కె టి ఎం స్పోర్ట్స్ వాహనాల తయారీలో ప్రపంచంలోనే పేరు గాంచిన బెస్ట్ స్పోర్ట్స్ వాహనాలు. ఈ కె టి ఎం  వెహికల్స్ ఆస్ట్రియా దేశములో స్థాపించి మన ఇండియా లో బజాజ్ ద్వారా మార్కెటింగ్ జరుగుతుంది. ఈ అధునాతన కొత్త షోరూం ను వరుణ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్  సంస్థ వెటర్నరీ కాలనీ విజయవాడ నందు ప్రారంబించారు. కె టి ఎం  షోరూం ని కే.దామోదరరావు (ఏసీపీ, విజయవాడ సిటీ) షోరూంని ప్రారంభించారు. పి. కార్తీక్ (కె టి ఎం-ఏరియా సేల్స్ మేనేజర్) & పి.వి.సత్యనారాయణ  జ్యోతి ప్రజ్వలన చేయగా మొదటి వాహన డెలివరీ కే.దామోదరరావు డెలివరీ చేసారు. ఈ సందర్భంగా వరుణ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ బజాజ్ డివిజన్ ఎగ్జిక్యూటివ్  డైరెక్టర్  పి.వి.సత్యనారాయణ మాట్లాడుతూ కస్టమర్స్ సౌలభ్యం కొరకు పెద్ద షోరూమ్ ప్రారంభించడం జరిగింది అని తెలియజేసారు. యువత కి నచ్చుతున్న బెస్ట్ స్పోర్ట్స్ వాహనము గా ఉన్న కె టి ఎం  ప్రోడక్ట్ ను వరుణ్ మోటార్స్ ద్వారా మార్కెటింగ్ చెయ్యటం చాల సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ స్పోర్ట్స్ వాహనము వాడే ప్రతి కస్టమర్ హెల్మెట్ తప్పనిసరిగా వాడాలి అని కస్టమర్స్ కి తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రములో కె టి ఎం &  బజాజ్ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *