Breaking News

న్యాయ అవగాహన మరియు విస్తరణ ద్వారా పౌరుల సాధికారత…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
నల్సా ప్రవేశపెట్టిన “న్యాయ అవగాహన మరియు విస్తరణ ద్వారా పౌరుల సాధికారత” పై ప్రతి ఒక్కరిలోనూ కనీస అవగాహన అవసరమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి కె. ప్రత్యూష కుమారి పేర్కొన్నారు. శనివారం రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ లోని మెప్మా కార్యాలయం నందు “న్యాయ అవగాహన మరియు విస్తరణ ద్వారా పౌరుల సాధికారత”పై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి కె. ప్రత్యూష కుమారి మాట్లాడుతూ, మెప్మా కార్యకర్తలు నిత్యం సమాజం లో మహిళల అభివృద్ధికి, సమాజ శ్రేయస్సు కోసం పనిచేస్తారని, వారు సామాజిక భాధ్యత గా నల్సా కార్యక్రమానికి ఏ విధంగా తోడ్పడాలో సూచనలు చేశారు. అందులో భాగంగానే ప్రజలలో న్యాయ విజ్ఞానం కలిగించడానికి తమ వంతు సహాయం అందించాలని కోరారు. ఈ సందర్భంగా పోక్సో యాక్ట్-2012, గృహ హింస చట్టం, ఐపిసి సెక్షన్ 498(ఏ) మొదలగు చట్టాలపై అవగాహన కల్పించారు.  అనంతరం గోకవరం బస్ స్టాండ్ అంబేద్కర్ బొమ్మ సెంటర్ వద్ద మానవహారంగా ఏర్పడి నల్సా చట్టాలు , న్యాయ సేవాధికార సంస్థ అందించే సేవలు పై అవగాహన కలిగించే నినాదాలు చేశారు.

ఈ కార్యక్రమంలో సాంకేతిక నిపుణులు పి. శ్రీదేవి, సంస్థాగత నిర్మాణ నిపుణులు కె. మోహన్ కుమార్, టౌన్ మిషన్ కో-ఆర్డినేటర్ జె. వి. వి. ఎన్. భవాని, పానెల్ లాయర్ జీ. మోహన వంశీ, దాదాపు 200 మంది మెప్మా కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ రోజు చేపట్టిన కార్యక్రమంలో భాగంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నందు సాయిరామ్ దంత వైద్యశాల వారి సహకారంతో రాజమహేంద్రవరం న్యాయ సంస్థ ఉద్యోగులు కోసం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డా.అపూర్వ దంత సంరక్షణ ప్రాముఖ్యతను తెలియజేస్తూ పలు సూచనలు ఇచ్చారు. అనంతరం దంత పరీక్షలు చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అవుట్‌ఫాల్ డ్రెయిన్ల డీసిల్టింగ్ పనులను పరిశీలించిన కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *