Breaking News

సంఘటితంగానే సమస్యల సాధన సాధ్యం : చిగురుపాటి బాబూరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వృత్తి పరంగా ఉన్న వారందరూ సంఘటితంగా ఉంటేనే సమస్యల సాధన సాధ్యమౌతుందని సీపీఎం నేత చిగురుపాటి బాబూరావు అన్నారు. అమరావతి కార్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తొలి వార్షికోత్సవ సందర్భంగా ఆదివారం విజయవాడ ప్రగతినగర్ సుజనా భవన్ లో జరిగిన మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. ఈ సభకు అమరావతి కార్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎస్కే నాగూర్ అధ్యక్షత వహించారు. అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు అబ్దుల్ షరీఫ్ (సీనియర్ బాషామేస్త్రి) తొలుత అసోసియేషన్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సీహెచ్ బాబూరావు మాట్లాడుతూ మారుతున్న టెక్నాలజీ వల్ల చేతివృత్తుల వారు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆటోమొబైల్ రంగానికే తలమానికంగా ఉన్న విజయవాడ ఆటోనగర్ ని సైతం నగరం నుంచి మార్చివేయాలని చూస్తుందని అలాంటి సమయంలో అమరావతి కార్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. మెకానిక్స్ పట్ల పోలీసుల వేధింపు చర్యలను నిలిపివేయాలని కోరారు. నగర వ్యాప్తంగా ఉన్న కార్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్స్ నూతనంగా షెడ్లు ఏర్పాటు చేసుకునేందుకు డ్వాక్రా గ్రూపు సభ్యులకు, పేదలకు అమలు చేస్తున్న పథకాల మాదిరిగా ఒక్కొక్కరికి పది లక్షల రూపాయల వడ్డీ లేని రుణాలను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో హెల్పింగ్ హ్యాండ్స్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు, జనసేన కృష్ణా జిల్లా అఫీషియల్ స్పోక్స్ పర్సన్ మరీదు శివరామకృష్ణ, అసోసియేషన్ గౌరవ సలహాదారులు, సీనియర్ జర్నలిస్టు కొండా రాజేశ్వరరావు అమరావతి కార్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులందరికీ సభ్యత్వ నమోదు పత్రాలను, ఐడీ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా సభ్యులందరితో ప్రమాణ స్వీకారం (ప్రతిజ్ఞ) చేయించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి షేక్ సుభాని, కోశాధికారి కె సతీష్, ఉపాధ్యక్షులు అబ్దుల్ హాది, అబ్దుల్ రౌఫ్ భాషా, సహాయ కార్యదర్శులు ఎండి కరిముల్లా,వి నాంచారయ్య, కార్యవర్గ సభ్యులు ఏ సుబ్బారావు, ఎండీ రఫీ, ఎండీ అఫ్రోజ్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *