Breaking News

ఐఐటి , ఐజర్ లలో పెండింగ్ పనులు రానున్న డిసెంబర్ ఆఖరుకు పూర్తి కావాలి : జిల్లా కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర విద్యాసంస్థలు ఐ ఐ టి , ఐజర్ లలో పెండింగ్ పనులు డిసెంబర్ ఆఖరు కాళ్ళ పూర్తి కావాలని జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ సమావేశమందిరంలో ఐ ఐ టి , ఐజర్ సంస్థల , జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ , జేసి డి కె బాలాజీ సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఐ ఐ టి , ఐజర్ విద్యా సంస్థలకు అందించాల్సిన త్రాగునీటి సరఫరా పైప్ లైన్ , సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పనులు గ్రామీణ నీటి పారుదల శాఖ త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. విద్యా సంస్థల్లో అంతరాయం లేని విద్యత్ సరఫరా ఏర్పాటుకు అంచనాలు రూపొందించి పనులు చేపట్టి డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని సూచించారు. అలాగే ఏర్పాడు నుండి విద్యాసంస్థల వరకు విద్యత్ దీపాలు ఏర్పాటు చూడాలని అన్నారు. భూములకు సంబంధించి కోర్టు సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలని అర్దిఒ శ్రీకాళహస్తి వారికి సూచించారు. తుడా సెక్రటరీ తుడ పరిధిలో పెండింగ్ లో వున్న అనుమతులు త్వరగా పరిశీలించి పరిష్కరించాలని సూచించారు. అగ్నిమాపక శాఖ పరిశీలించి ఎన్ ఓ సి జారీ చేయాలని అన్నారు. అన్ని శాఖలకు సంబంధించిన పనులకు డిసెంబర్ ఆఖరుకు పూర్తి చేసాల సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఎ పి ఎస్ ఆర్ టిసి సంస్థల సూచనల మేరకు రిక్వెస్ట్ స్టాప్ , బస్ సెల్టర్ ఏర్పాటు, కోరిన వేళల్లో బస్సులు నడపడం చూడాలని సూచించారు. ఈ సమీక్షలో డి ఆర్ ఓ శ్రీనివాస రావు, శ్రీకాళహస్తి ఆర్ డి ఓ రామారావు, ఐ ఐ టి డైరెక్టర్ సత్యనారాయణ, రిజిస్టార్ ప్రసాద్ , ఐసర్ ఇ ఇ జార్జ్ సృజన్, అసిస్టెంట్ రిజిస్టార్ వెంకట దీపక్ , ఆర్ అండ్ బి అధికారి సుధాకర్ రెడ్డి, గ్రామీణ నీటి పారుదల శాఖ అధికారి విజయకుమార్, ఎస్.ఇ. ఎస్ పి డి సి ఎల్ కృష్ణరెడ్డి , తుడ సెక్రటరీ లక్ష్మి , డి పిఒ రాజశేఖర్ రెడ్డి , జిల్లా ప్రజా రవాణా అధికారి చెంగల్ రెడ్డి , అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *