Breaking News

O.C మహిళలకు వై.యస్.ఆర్ EBC నేస్తం పధకము…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వై.యస్.ఆర్ EBC నేస్తం ఈ ఏడాది నాటికీ 45 ఏళ్ళు నిండిన O.C మహిళలకు (కాపు నేస్తం లబ్దిదారులు మినహాయింపు) వై.యస్.ఆర్ EBC నేస్తం పధకము ద్వారా ప్రభుత్వం ఆర్ధిక సహాయం అందచేయనుంది. గతములో లబ్దిపొందిన లబ్దిదారుల జాబితా సచివాలయంలో వారి యొక్క వెల్ ఫేర్ సెక్రటరి ద్వారా వెరిఫికేషన్ జరుగుతుంది. కొత్తగా అర్హులైన లబ్దిదారులు గ్రామా, వార్డు సచివాలయాల ద్వారా పేర్ల నమోదు తో పాటు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం కొనసాగుతుంది. నవంబర్ 14 వ తేది వరకు పేర్ల నమోదు ప్రక్రియ ఉంటుందని అధికారులు వెల్లడించారు. 45-60 సంIIల మధ్య వయసు వున్నా O.C మహిళల( కాపు నేస్తం లబ్దిదారులు మినహాయింపు) ఆర్ధిక సాదికారిత కొరకు సంII నకు రూ.15000/- చొప్పున వై.యస్.ఆర్ EBC నేస్తం పధకము ద్వారా ఆర్ధిక సహాయము అందించపడుతుంది. BPL కుటుంబమునకు చెందిన వారు మాత్రమే అర్హులు. కొత్తగా దరఖాస్తు చేసుకొను వారు తగిన ఆధారములతో అనగా – ఆధార్ కార్డు, ఆధార్ అప్డేట్ హిస్టరీ, రైస్ కార్డు, కాస్ట్ సర్టిఫికేట్ (AP seva), ఇన్కమ్ సర్టిఫికేట్ (AP seva), ఎలక్ట్రిసిటీ బిల్ దరఖాస్తుతో పాటు సమర్పించవలెను. మీ సమీపములోని సచివాలయములో నవంబర్ 14 వ తేది లోపు దరఖాస్తు చేసుకోనవలసినదిగా తెలియజేయడమైనది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చైర్మన్ కె. బుచ్చి రామ్ ప్రసాద్ పదవీ బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తి

-గొల్లపూడి బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ కార్యాలయంలో అభినందన కార్యక్రమం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *