Breaking News

6 వ రాష్ట్ర స్థాయి రెవెన్యూ ఉద్యోగుల క్రీడా పోటీలు

-ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ప్రాంగణం లో నవంబర్ 11,12,13 తేదీల్లో
-జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న 75 మంది
-దాతలు సహకారంతో స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ
-జిల్లా కలెక్టర్ మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర స్థాయి రెవెన్యూ క్రీడా ల్లో పూర్వపు 13 జిల్లాలకు చెందిన రెవెన్యూ సిబ్బంది పాల్గొనడం జరుగుతోందని, నూతన తూర్పు గోదావరి జిల్లా నుంచి 75 మంది వివిధ క్రీడల్లో పాల్గొంటున్నట్లు జిల్లా కలెక్టర్ కే. మాధవీలత అన్నారు.

గురువారం స్థానిక కలెక్టర్ ఛాంబర్ లో పరమేసు బయోటెక్ ప్రవేట్ లిమిటెడ్ పోప్రైటర్ ఏ. ఆనంద్ స్వరూప్ కిట్స్ ను కలెక్టర్ చేతుల మీదుగా రెవెన్యూ క్రీడా కారులకు అందచేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత జిల్లా తరపున వివిధ క్రీడల్లో పాల్గొంటున్న ఉద్యోగులకు అభినందనలు తెలియచేశారు. క్రీడల్లో రాణించాలంటే క్రీడా పరికరాలు చాలా అవసరం అన్నారు. ఆనంద్ స్వరూప్ స్వచ్ఛందంగా సుమారు రూ.1,50,000 లు ఖరీదు చేసే షూస్, ఇతర క్రీడా పరికరములు అందించడం జరిగిందన్నారు. కంపెనీలు సమాజ బాధ్యత సమాజ శ్రేయస్సు, క్రీడా పోటీలకు చేయూత నివ్వడం ద్వారా మరికొందరికి స్ఫూర్తిగా నిలవాలని పేర్కొన్నారు. 6 వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి రెవెన్యూ ఉద్యోగుల క్రీడా పోటీలు నవంబర్ 11, 12, 13 తేదీల్లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ప్రాంగణం లో మూడు రోజుల పాటు జరుగుతాయని తెలిపారు.

తూర్పు గోదావరి జిల్లా లో కొత్తగా ఏర్పడిన రెవెన్యూ శాఖ అధ్యక్షులు బి. బాపిరాజు మాట్లాడుతూ, మన జిల్లా నుంచి మొత్తం 75 మందిమి ఈ క్రీడల్లో పాల్గొంటు న్నట్లు తెలిపారు. క్రికెట్, వాలీబాల్, టెన్నీస్, కబడ్డీ, స్విమ్మింగ్, త్రో బాల్ తదితర క్రీడల్లో జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న ట్లు పేర్కొన్నారు. పాత 13 జిల్లాల ప్రాతిపాదికన ఈ ఏడాది పోటీల్లో రెవెన్యూ ఉద్యోగులు పాల్గొంటున్నట్లు తెలియచేశారు. దేవరపల్లి కి చెందిన పారిశ్రామిక వేత్త ఆనంద్ స్వరూప్ ముందుకు వచ్చి స్పోర్ట్స్ కావలసిన పరికరాలు, వస్తువులు ఉచితంగా అందచేసినందుకు అసోసియేషన్ తరపున కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏ వో జీ. భీమా రావు, జిల్లా రెవెన్యూ సంఘం అధ్యక్షుడు జి. బాపిరాజు, ఉద్యోగులు గోపి చంద్, సురేష్ బాబు, సిసి గంగాధర్, కంపెనీ యజమాని ఆనంద్ స్వరూప్, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చైర్మన్ కె. బుచ్చి రామ్ ప్రసాద్ పదవీ బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తి

-గొల్లపూడి బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ కార్యాలయంలో అభినందన కార్యక్రమం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *