Breaking News

అజాతశత్రువు మన రాష్ట్ర ప్రణాళికా బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్టు…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రణాళికా బోర్డు ఉపాధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన మల్లాది విష్టు ను శుక్రవారం అమరావతి సచివాలయం 5వ బ్లాకులో ని ఆయన నూతన చాంబరులో ఏపీ ఎమ్మార్పీఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మేదర సురేష్‌కుమార్‌ కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మేదర సురేష్‌కుమార్‌ మీడియాతో మాట్లాడుతూ అజాతశత్రువు మన మల్లాది విష్ణు వర్ధన్ అని కొనియాడారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చూపిన బాటలో ఆయన నడవడమే కాకుండా కార్యకర్తలను కూడా స్వచ్ఛందంగా నడిచేలా చేస్తూ నియోజకవర్గ ప్రజలకు నేనున్నానని ప్రతినిత్యం అందుబాటులో ఉండే మనసున్న నాయకుడు మల్లాది విష్ణు అని అన్నారు. పేద బడుగు బలహీనవర్గాల వారికి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారికి ఏ విధమైన సహాయం కావాలన్నా, సంక్షేమ పథకాలు సక్రమంగా అందరికీ అందేలా నిత్యం ప్రజల్లో ఉండే మన నాయకుడు మల్లాది విష్ణు మరిన్ని ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. మన నాయకుడు మల్లాది విష్ణు కి సముచిత స్థానం కల్పించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి మరిన్ని ధన్యవాదాలు తెలిపారు. ఆయన ను కలిసిన వారిలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలు…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో బుధవారం జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *