Breaking News

పేదలకు అండగా దేవినేని రాజశేఖర్ నెహ్రు ట్రస్ట్ : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాజకీయ నాయకులకు సేవే పరమావధి కావాలని ఆకాంక్షించే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అడుగుజాడల్లో విజయవాడ నగరంలో దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సామాజిక సేవ కార్యక్రమాలు చేపడుతున్నట్టు తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్, ట్రస్ట్ చైర్మన్ దేవినేని అవినాష్ తెలిపారు. శనివారం తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ కార్యాలయంలో నిరుపేద కుటుంబాలకు చెందిన బుదాల సుజాత, జొన్నలగడ్ద మేరీలకి దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఒక్కోటీ దాదాపు 40వేల రూపాయల విలువ గల రెండు టిఫిన్ బండ్లని అవినాష్ ఉచితంగా అందజేశారు. అవినాష్ మాట్లాడుతూ దేవినేని నెహ్రూ ఎప్పుడు కూడా పేదలకు అండగా ఉండేవారని, కష్టం అంటూ ఎవరు ఇంటికి వచ్చిన కులమత పార్టీలకతీతంగా వారికి అండగా నిలిచి, సమస్య పరిష్కారానికి కృషి చేశారని,నేడు ఆయన తనయుడు గా నేను కూడా అదేబాటలో నడుస్తూ దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విద్య, వైద్య, ఉపాధి కల్పన కోసం అనేక సేవ కార్యక్రమలు చేపట్టడం జరిగిందని వివరించారు. జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల అభ్యున్నతికి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు అని అన్నారు. రాబోయే రోజుల్లో అందరం కలిసికట్టుగా వైస్సార్సీపీ పార్టీ బలోపేతం చేయడంతో పాటు, విస్తృతంగా సేవ కార్యక్రమలు చేపడతామని తెలియజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *