Breaking News

స్పందనలో 20 ఫిర్యాదులు…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సోమవారం స్పందనలో 20 ఫిర్యాదులు ప్రజల నుంచి రావడం జరిగిందని ఏ డి సి  పి ఎం సత్యవేణి పేర్కొన్నారు. సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం సి పి సూరజ్ కుమార్, ఎస్సీ పాండురంగారావు ఇతర  అధికారుల తో కలిసి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం  స్పందన ఫిర్యాదులపై.  సచివాలయ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. స్పందన లో వొచ్చిన అర్జీలు పరిష్కారం కోసం అత్యంత ప్రాధాన్యత ఇచ్చి పరిష్కారం చూపాలన్నారు. ఒక వేళ అర్హత లేదని నిర్ధారణ అయితే ఆ విషయం ఆర్జి దారునికి తెలియ చెయ్యాల్సిన బాధ్యత అధికారులపై, ఇటు సిబ్బంది పై ఉందన్నారు. పరిష్కారము చేసివ అర్జీల ఫోటోతో పాటు వివరాలు కూడా ఖచ్చితంగా ఆన్లైన్ లో అప్లోడ్ చెయ్యాలని స్పష్టం చేశారు. ఈరోజు స్పందనలో ఇంటి పన్ను, రహదారుల మరమ్మత్తులు, పెన్షన్, కుళాయి పన్ను, శానిటేషన్ , రోడ్ వైడింగ్ తదితర ఆర్జి లను అందచేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చైర్మన్ కె. బుచ్చి రామ్ ప్రసాద్ పదవీ బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తి

-గొల్లపూడి బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ కార్యాలయంలో అభినందన కార్యక్రమం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *