Breaking News

వాల్మీకుల ఆత్మీయ కలయిక…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కార్తీక మాసం వన సమారాధన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వాల్మీకుల ఆత్మీయ కలయిక అన్నమయ్య జిల్లా మదనపల్లి లోని హార్సిలీ హిల్స్ కాన్ఫరెన్స్ హాల్లో 27వ తారీకు ఆదివారం నాడు నిర్వహిస్తున్నట్లు వాల్మికి రిజర్వేషన్ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు పొదల నరసింహులు తెలియజేశారు. గాంధీనగర్ స్థానిక ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో నరసింహులు మాట్లాడుతూ వాల్మీకుల ఎస్టీ పురోధరణ కోసం 65 సంవత్సరాలుగా అలుపెరిగిన పోరాటం చేస్తున్న ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సుదీర్ఘకాలంగా చేస్తున్న ఈ పోరాటం ఫలితం సాధించాలంటే రాష్ట్రంలో ఉన్న వాల్మీకి సోదరులు అందరూ ఒక్కతాటిపై ఉండాలని సూచించారు. అలానే రాష్ట్రంలో ఉన్న వాల్మీకి కుల సంఘాలన్నీ ఏకమై ఈ పోరాటంలో పాలుపంచుకోవాలని కోరారు. అందరం ఒకటై ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావడానికి ఇది ఒక వేదికగా మలుచుకోవాలని దీనికి ఉద్యోగస్తులు సంఘ నాయకులు విశ్రాంత ఉద్యోగులు మహిళలు యువత అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని నరసింహులు విజ్ఞప్తి చేశారు. అలానే వాల్మీకుల అభివృద్ధికై ఎస్టీ పునరుద్ధరణ కోసం మీ అమూల్యమైన విలువైన సలహాలు సూచనలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి గంపల గంగరాజు మదనపల్లి నియోజకవర్గ అధ్యక్షులు పులి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *