Breaking News

ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ విజయవాడ వారు ఎమరాల్డ్ జూబిలీ వేడుకలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ విజయవాడ వారు ఎమరాల్డ్ జూబిలీ వేడుకలు స్థానిక లెమన్ ట్రీ హోటల్ నందు జరిగాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి 280 మంది క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా అంతర్జాతీయ ఇన్నర్ వీల్ అధ్యక్ష్యురాలు జునైడా ఫార్కన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కానూరు లోని వాసవ్య బాలికల వసతి గృహం (వాసవ్య చిల్డ్రన్స్ హోమ్) రూప్ సోలార్ ప్లాంట్ ను, కమ్యూనిటి డిసీజెస్ పై అవగాహన అందించడానికి యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ తో ఒప్పందం (యం.ఓయు) చేసుకొని “నో యువర్ నెంబర్స్’ ప్రాజెక్ట్ ను, మహిళా సాధికారత విషయాలు జన శిక్షణా సంస్థతో కలిసి “మహిళా ఉత్సవ్”లాంటి కార్యక్రమాలను రూపొందించడం పై సంతోషిస్తూ క్లబ్ ఇంకా మరెన్నో సేవలను చేయాలని ఆమె పిలుపు నిచ్చారు. అనంతరం జునైదా ఫార్కన్ సమాజ ప్రగతికి నిస్వార్థ సేవలందిస్తున్నందుకు ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ విజయవాడ పాస్ట్ ప్రసిడెంట్ పి.డి.సి రశ్మి సమరం గారికి అంతర్జాతీయ మార్గరెట్ గోల్డింగ్ అవార్డును ప్రధానం చేయడం జరిగింది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *