Breaking News

నిరాశ్రయులకు ఆపన్న హస్తం అందింస్తున్న దాతల సహకారం మరువలేనిది…

-అగ్నిప్రమాదంలో బాధితులు కోల్పోయిన సర్టిఫికేట్లను త్వరలో అందిస్తాం…
-జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయి నిరాశ్రయలైన భాధితులకు కూడు గూడు గుడ్డ అందించి వారిని ఆదుకోవడంలో దాతల సహకారం మరువలేదని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అన్నారు. ఇటీవల నగరంలోని ఆవరణంలో పకీరు గూడెం, అయ్యప్పనగర్‌, వించిపేట ప్రాంతాలలో జరిగిన అగ్నిప్రమాద భాధితులకు నెస్లే ఇండియా మరియు జూనియర్‌ ఛాంబర్‌ఆఫ్‌ ఇంటర్‌నేెషనల్‌ (జెసిఐ) సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం బెంజ్‌ సర్కిల్‌ సమీపంలోని జ్వోతి కన్వెషన్‌ హాల్‌లో నిర్వహించిన నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు హాజరై బాధితులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ డిల్లీరావు మాట్లాడుతూ అట్టడుగున జీవిస్తున్న నిరుపేద కుటుంబాల వారు ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోవడం బాధకరమన్నారు. బాధితులను ప్రభుత్వం పరంగా ఆదుకుంటున్నప్పటికి స్వచ్ఛంద సంస్థలు దాతలు ముందుకు వచ్చి బాధితులను ఆదుకోవడం అభినందనీయమన్నారు. వ్యాపార రంగంలో స్థిరపడి సంపాదించిన దానిలో కొంత పేదలకు ఖర్చు చేయాలన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో కలగాలన్నారు. నెస్లే సంస్థ పేదల సంక్షేమం కొరకు నిర్వహించే కార్యక్రమంలో భాగంగా అగ్ని ప్రమాద బాధితులను ఆదుకోవడానికి ముందుకు వచ్చినందుకు అభినందనలు తెలియజేస్తున్నానన్నారు. జూనియర్‌ ఛాంబర్‌ఆఫ్‌ ఇంటర్‌నేెషనల్‌ (జెసిఐ) సంస్థల సామాజిక సేవ కార్యక్రమాలు చేపట్టి సమాజంలో పేదలకు సేవ చేయడం ప్రతి ఒక్కరికి స్పూర్తిదాయకంగా నిలుస్తోందన్నారు. పేద ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం జగనన్న ఆసరా ద్వారా పెన్షన్ల పంపిణీ, రేషన్‌ దుకాణాల ద్వారా నిత్యావసర సరుకులు, ఆరోగ్యశ్రీ పథకంలో వైద్య సేవలను అందించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు తోడు స్వచ్ఛంద సంస్థల దాతలు ముందుకు వచ్చి పేదలను ఆదుకోవాలని ఆయన అన్నారు. అగ్ని ప్రమాదంలో బాధితులు కోల్పోయిన ఆధార్‌, రేషన్‌ కార్డులు, కుల దృవీకరణ పత్రాలు, మెడికల్‌ సర్టిఫికెట్ల వంటివి వారం రోజులలో మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. నెస్లే ఇండియా, జూనియర్‌ ఛాంబర్‌ఆఫ్‌ ఇంటర్‌నేెషనల్‌ (జెసిఐ) సంస్థ వారు బాధితులకు 2 లక్షల రూపాయల గల నిత్యావసర వస్తువులు, దుప్పట్లు, స్టీల్‌ బిందెలు, వంట పాత్రలను కలెక్టర్‌ డిల్లీరావు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నెస్లే ఇండియా మేనేజర్‌ వసీంఅహమ్మద్‌, జూనియర్‌ ఛాంబర్‌ఆఫ్‌ ఇంటర్‌నేెషనల్‌ (జెసిఐ) సంస్థ విజయవాడ అధ్యక్షులు చింతమనేని సాహితి, సభ్యులు యద్దనపూడి సతీష్‌కుమార్‌, అక్కినేని శిల్పా, బి. అజయ్‌కుమార్‌, తహాశీల్థార్లు యం వెంకటరామయ్య, యం.మాధురి, ఆర్‌ఐ మణికంఠ, విఆర్‌వోలు ఎస్‌ కె భాష, ఆర్‌ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *