Breaking News

సీనియర్ పాత్రికేయులకు సత్కారం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నేడు జాతీయ పత్రిక దినోత్సవం సందర్భంగా మన ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన సీనియర్ పాత్రికేయులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు గా మన ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కోలా అజయ్ వహించారు. జాతీయ పత్రిక దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సీనియర్ పాత్రికేయులు అయినా ఈనాడు గిరి కుమార్, సాక్షి బాబు మరియ ఏపీ టీఎస్ రిపోర్టర్ శివాజీ కి మన ప్రెస్ క్లబ్ సభ్యులు శాలువాతో సత్కరించారు. అనంతరంసీనియర్ పాత్రికేయుల తొ మన ప్రెస్ క్లబ్ సభ్యులు అందరూ కలసి కేక్ కటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈనాడు గిరి కుమార్ మాట్లాడుతూ జర్నలిస్ట్ అంటే కలం పట్టిన సైనికుడు, జర్నలిస్ట్ అంటే అక్షరాలను తూటాల్లా చేసుకుని, అవినీతి లొసుగులను బయటకులాగే వేటగాడు. పొలంలో విత్తుని మొలకెత్తించడానికి రైతు తన శ్రమను ఎలా ధారపోస్తాడో, ఒక వార్తను సేకరించడానికి, విలేఖరి తన సర్వశక్తులూ ఉపయోగిస్తాడు.అతనిది బ్రతుకు పోరాటం. మనది మంచిని బ్రతికించాలనే ఆరాటం జర్నలిజం బ్రతుకు అక్షరాల వెంట పరిగెడుతుంది.ఉరుకుల పరుగుల జీవితంలో, తన చుట్టూ ఎన్ని సమస్యలు చుట్టిముట్టినా తట్టుకుని సమాజంలో ఉన్న సమస్యలకి పరిష్కారం చూపించాలనే తపనతో, కనిపించిన ప్రతి దాంట్లో జర్నో కోణాన్ని వెతుక్కుంటాడు.అలా రోజూ కామన్ మ్యాన్ లా ఆలోచించి జర్నీ మొదలు పెడతాడు మరి ఈరోజు మన ప్రెస్ క్లబ్ సభ్యులు సీనియర్ పాత్రికేయులను గుర్తించి సత్కరించటం చాలా గర్వ కారణమని ఆయన అన్నారు. అనంతరం సాక్షి బాబు మాట్లాడుతూ జర్నలిస్టు ఆ గడియారం ముల్లు ఒకటి నుండి పన్నెండుదాకా తిరిగితే.. జర్నలిస్టు లోకం చుట్టు తిరుగుతూ, 24 గంటలు అదే ధ్యాసలో బ్రతికేస్తాడు. పేరుకు అతనికి 8 గంటలే డ్యూటీ అయినా నిద్రపోనంత వరకు, బుర్ర మాత్రం సమాజం చుట్టే తిరుగుతూ ఉంటుంది.
తాను పడే వేదనలో, తన మెదడులో మెదిలో ఆలోచనల్లో బాస్ దగ్గర శభాష్ అనిపించుకోవాలంటే ఏలాంటి స్టోరీలు రాయాలి, కళ్ల ముందు ఉన్న సమస్యలకు పరిష్కారం చూపించేలా వాటిని ఎలా ప్రెజెంట్ చేయాలి అనే ప్రతిక్షణం ప్రజల సమస్యల పట్ల పోరాటం చేస్తున్న జర్నలిస్టు అందరికీజాతీయ పత్రిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలోమన ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు సత్య, ప్రధాన కార్యదర్శిఆనంద్,కోశాధికారిరాఘవులు,మరియు మన ప్రెస్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *