Breaking News

మేనిఫెస్టోను గడప గడపకూ తీసుకెళ్తున్న ఘనత వైఎస్సార్ సీపీ ప్రభుత్వానిది

-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణు
-31వ డివిజన్ 211 వ వార్డు సచివాలయం పరిధిలో రెండో రోజు గడప గడపకు మన ప్రభుత్వం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో గడప గడపలో సంక్షేమ కాంతులు వెల్లివిరుస్తున్నాయని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. గురువారం 31 వ డివిజన్ 211 వ వార్డు సచివాలయం పరిధిలో స్థానిక కార్పొరేటర్ పెనుమత్స శిరీష సత్యంతో కలిసి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. శ్రీనగర్ కాలనీ వీధులలో విస్తృతంగా పర్యటించి.. 282 గడపలను సందర్శించారు. అన్ని వర్గాల ప్రజలను పేరుపేరున పలకరిస్తూ.. ఏ ఇంట్లో ఏఏ పథకాల ద్వారా ఎంత మేర లబ్దిచేకూరిందో వివరించారు. ప్రతీ ఇంట్లో కనీసం ఒక్క సంక్షేమ పథకం ద్వారా అయినా లబ్ధి చేకూర్చాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తోందని మల్లాది విష్ణు తెలిపారు. ఏవైనా సాంకేతిక కారణాలతో సంక్షేమ పథకాలు అందని అర్హులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. గత టీడీపీ పాలనలో ఏ ఒక్క పథకం వర్తించాలన్నా.. జన్మభూమి కమిటీలకు పెద్దమొత్తంలో లంచాలు ముట్టజెప్పవలసి వచ్చేదని మల్లాది విష్ణు అన్నారు. కానీ నేడు ఏదైనా సమస్యపై సచివాలయాలను ఆశ్రయిస్తే.. తప్పక పరిష్కారం లభిస్తుందనే నమ్మకం ఈ మూడేళ్ల కాలంలో ప్రజలలో బలంగా ఏర్పడిందన్నారు.

విద్యా వ్యవస్దకు ఊపిరి పోసింది వైఎస్సార్ కుటుంబ‌మే
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో విద్యా వ్యవస్దకు ఊపిరి పోసింది నాడు దివంగ‌త మ‌హానేత వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి గారు, నేడు ఆయ‌న కుమారుడు వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌ రెడ్డి మాత్రమేన‌ని మల్లాది విష్ణు అన్నారు. కానీ విద్యా రంగాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించిన చంద్రబాబు.. పాఠశాల విద్య గూర్చి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. గత ప్రభుత్వంలో విద్యాలయాలు శిథిలావస్థకు చేరి ఎప్పుడు కూలిపోతాయో తెలియని దయనీయ పరిస్థితులలో ఉండేవని.. కానీ నేడు సకల వసతులతో కళకళలాడుతున్నాయన్నారు. మూడేళ్ల కాలంలో విద్యారంగానికి రూ. 53 వేల కోట్లకు పైగా నిధులు కేటాయించిన ఏకైక ప్రభుత్వం వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మాత్రమేనని కితాబిచ్చారు. సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటివరకు రూ. 240 కోట్ల నిధులు వెచ్చించినట్లు తెలియజేశారు. విద్యా రంగంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు దేశానికే తలమానికంగా నిలిచాయన్నారు. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలను సమకూర్చడంతో పెద్ద ఎత్తున విద్యార్థుల చేరికలు పెరిగాయన్నారు. గత ప్రభుత్వంలో 37 లక్షలు మాత్రమే ఉన్న విద్యార్థుల సంఖ్య.. ఈ ప్రభుత్వంలో 43 లక్షలకు పైగా చేరిందని వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల కోసం సిఫారసులు పెరిగాయంటే.. ఆ ఘనత ముమ్మాటికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని తెలియజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

సీఎం వైఎస్ జగన్ గ్రాఫ్‌ పెరుగుతుంటే ఓర్వలేక విమర్శలు
వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై ఈర్ష్య, ద్వేషం రోజురోజుకీ చంద్రబాబు, ఆయన మద్దతుదారుల్లో పెరిగిపోతోందని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణు అన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో వరుసగా మూడేళ్లు ఏపీని దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిపిన సీఎం వైఎస్ జగన్ కు పాలన చేతకాదని మాట్లాడటం ప్రతిపక్షనేతలో దాగున్న అసూయకు అద్దం పడుతోందన్నారు. 2024 ఎన్నికలలో వైఎస్సార్ సీపీని ఢీకొనే సత్తా లేక ప్రజలలోకి రోజుకొక తప్పుడు సంకేతాన్ని పంపుతున్నారని మండిపడ్డారు. 2019 సార్వత్రిక ఎన్నికలతోనే తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర ప్రజలు రాజకీయ మరణ శాసనం రాశారని వ్యాఖ్యానించారు. దీంతో ఒక్క అవకాశం కోసం చివరకు ప్రజలను ప్రాథేయపడే స్థాయికి చంద్రబాబు దిగజారారన్నారు. బాబు మాటల్లో ఫ్రస్ట్రేషన్ తప్ప ఇంకేమీ కనిపించట్లేదని పేర్కొన్నారు. వేదికలపై చంద్రబాబు ఎంతగా ఊగిపోయినా.. రాష్ట్ర ప్రజలందరూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే ఉన్నారన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని మల్లాది విష్ణు అన్నారు. కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, నార్త్ ఎమ్మార్వో దుర్గాప్రసాద్, డీఈ(ఇంజనీరింగ్) గురునాథం, ఏఎంఓహెచ్ రామకోటేశ్వరరావు, నాయకులు బెజ్జం రవి, పట్టాభి రామరాజు, మానం వెంకటేశ్వరరావు, పెరుమాళ్ల జయకర్, కనపర్తి కొండా, సామంతపూడి గోవిందరాజు(చిన్నా), అంగిరేకుల విజయ్, గుండె సుందర్ పాల్, సచివాలయ సిబ్బంది, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *