గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థలో పని చేసే కార్మికులు మరియు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ చూపాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ విభాగాధిపతులను ఆదేశించారు. గురువారం నగర పాలక సంస్థ ఉద్యోగులు మరియు సిబ్బంది సమస్యల పరిష్కారం కొరకు మీట్ ది కమిషనర్ ప్రోగ్రాంను కమిషనర్ ఛాంబర్ లో నిర్వహించి, ఇటీవల మరణించిన కార్మికురాలు కుటుంబ సభ్యులకు అసిస్టెంట్ కలెక్టర్ శివనారాయణ శర్మ తో కలిసి ఎక్స్గ్రేషియా చెక్ ను అందించారు.
ఈ సందర్భంగా కమిషనర్ గారు మాట్లాడుతూ విభాగాల వారీగా కార్మికుల సమస్యల పరిష్కారంకు నిర్దేశిత గడువులోగా చర్యలు తీసుకోవాలని, గడువులోగా పరిష్కరించని అధికారుల పై చర్యలు తప్పవన్నారు. మరణించిన కార్మికులు లేదా ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇచ్చే ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించాలని, ఎటువంటి అవినీతికి పాల్పడినా భాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కార్మికులు కూడా తమకు అందే జీతాలు, ఇతర అలవెన్స్ లకై ఎవ్వరికీ ఎటువంటి నగదు ఇవ్వాల్సిన పని లేదని, ఎవరైనా నగదు డిమాండ్ చేస్తే ప్రతి గురువారం జరిగే గ్రీవెన్స్ లో నేరుగా తమ దృష్టికి తేవాలన్నారు. కార్మికులు తమ సమస్యల పై మీట్ ది కమిషనర్ లో ఇచ్చే వాటిని రిజిస్టర్ లో నమోదు చేసి, నిర్దేశిత గడువులోగా పరిష్కారం జరగాలని, ప్రతి వారం ఆర్జీలు, తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అనంతరం నగరపాలక సంస్థ ప్రజారోగ్య విభాగం15వ డివిజన్ లో అప్కాస్ ద్వారా విధులు నిర్వహిస్తూ మరణించిన బంగారు పార్వతి కుమారుడు శ్రీనుకు రూ. రూ.2. లక్షల ఎక్స్ గ్రేషియా చెక్ అందించడం జరిగింది.
Prajavartha Online Telugu News