Breaking News

జిల్లాలో నవంబర్ 19 , 23 , 24 , 25 తేదీల్లో ఆధార్ కార్డు అప్డేషన్

-ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి
-కలెక్టర్ మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ ఆదేశాల మేరకు పదేళ్ళ క్రిందట ఆధార్ కార్డు పొందిన ప్రతి ఒక్కరు వారి ఆధార్ కార్డును తప్పనిసరిగా నవీకరణ (అప్ డేట్) చేయించుకోవలసి ఉందని జిల్లా కలెక్టర్ డా.కె.మాధవీలత శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2010 నుండి 2016 మధ్య కాలంలో ఆధార్ కార్డు పొందిన వారు మధ్యలో ఎటువంటి పేరు చిరునామా మరియు ఇతర మార్పులు చేసుకోని వారు విధిగా తమ ఆధార్ కార్డును అప్ డేట్ చేయించుకోవలసియున్నదని పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో ఈనెల 19 మరియు 23 24 25 తేదీల్లో ఆధార్ కార్డు అప్ డేట్ చేయించుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు జిల్లా వ్యాప్తంగా చేశామని మాధవీలత పేర్కొన్నారు. ప్రజల సౌలభ్యం కోసం పాఠశాలలో, గ్రామ / వార్డు సచివాలయాలలో , మొబైల్ ఆధార్ నమోదు కేంద్రాలలో ఇందుకు సంబంధించిన ఏర్పాటు చేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేసినారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అవుట్‌ఫాల్ డ్రెయిన్ల డీసిల్టింగ్ పనులను పరిశీలించిన కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *