Breaking News

దేశవ్యాప్తంగా 75 ‘జెండర్ రిసోర్స్ సెంటర్స్’ ను ఈ నెల 25న లాంఛనంగా ప్రారంభించనున్న భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము..

-విజయవాడలో సెర్ప్ కార్యాలయంలో ‘‘అన్ని రాష్ట్రాలలో లింగ వివక్షతకు వ్యతిరేకంగా జాతీయ ప్రచారం’’ అంశంపై స్టేట్ లెవల్ వర్క్ షాప్ నిర్వహణ..

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశవ్యాప్తంగా 75 ’జెండర్ రిసోర్స్ సెంటర్స్’ను ఈ నెల 25న భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము లాంఛనంగా ప్రారంభిస్తారని గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ (సెర్ప్) ముఖ్య కార్య నిర్వహణాధికారి ఎ.ఎమ్.డి ఇంతియాజ్ తెలిపారు. ‘‘అన్ని రాష్ట్రాలలో లింగ వివక్షతకు వ్యతిరేకంగా జాతీయ ప్రచారం’’ (National Campaign Against Gender based Discrimination) అంశంపై కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు విజయవాడ ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ భవన్ లో సెర్ప్ కార్యాలయములో శుక్రవారం ఎ.ఎమ్.డి. ఇంతియాజ్ అధ్యక్షతన స్టేట్ లెవెల్ వర్క్ షాప్ కి నిర్వహించారు. ఈ సమావేశానికి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్టుమెంటు, స్టేట్ లీగల్ సర్వీస్ అధారిటీ, ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ డిపార్టుమెంటు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్, MEPMA (పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ), వెల్ఫేర్ అఫ్ డిఫరెంట్లి ఆబిల్డ్ సీనియర్ సిటిజెన్ అండ్ ట్రాన్స్ జెండర్, సర్వశిక్షా అభియాన్ డిపార్ట్ మెంట్ ల నుండి UNICEF, మురళీకృష్ణ మెమోరియల్ ట్రస్ట్, AP MAS, వాసవ్య మహిళా మండలి, రైతు సాధికారత సంస్థ, కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ నుండి NRLM NRP (నేషనల్ రిసోర్స్ పర్సన్), సెర్ప్ అధికారులు హాజరై వారి సలహాలు, సూచనలు తెలియజేశారన్నారు. వారి సూచనలను పరిగణన లోకి తీసుకుని 25, నవంబర్ నుండి 23, డిశంబర్ 2022 వరకూ చేయవలసిన ప్రచారానికి ప్రణాళిక రూపొందించి అమలు చేస్తామన్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వారు లింగ అసమానత్వ సమస్యలు ఎదుర్కోవడం కోసం, నిర్మాణాత్మకమైన వ్యూహాలను అమలు చేయడం కోసం DAY NRLM ద్వారా స్వయం సహాయక సంఘాలు, ఇతర ప్రభుత్వ విభాగాలు, వివిధ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ అనుసంధానంతో ఈ నెల 25 నుండి డిశంబర్ 23వ తేదీ వరకూ అన్ని రాష్ట్రాలలో లింగ వివక్షతకు వ్యతిరేకంగా జాతీయ ప్రచారం నిర్వహించాలని సూచించడం జరిగిందని ఆయన తెలిపారు.
ఈ సంవత్సరం నిర్వహించే క్యాంపెయిన్ థీమ్ “భయం, వివక్ష మరియు హింస లేకుండా గౌరవప్రదమైన జీవితానికి నిర్మాణాత్మక అడ్డంకులను పరిష్కరించడం ద్వారా మహిళలు మరియు లింగ-వైవిధ్య వ్యక్తుల యొక్క హక్కులను మరియు సంస్థలను ముందుకు తీసుకువెళ్ళడం” (’advance the agency and rights of women and gender-diverse individuals, by addressing structural barriers to a dignified life without fear, discrimination and violence’) అని ఇంతియాజ్ తెలిపారు. అందరి సమన్వయంతో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఎ.ఎమ్.డి ఇంతియాజ్ కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *