విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
TNSF ఆధ్వర్యంలో జరుగుతున్న విజయవాడ ప్రీమియర్ లీగ్ 2022 క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ముఖ్యఅతిథిగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కేశినేని ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్ట్, కేశినేని శివనాథ్(చిన్ని) హాజరయ్యారు. అలాగే తెలుగు యువత నాయకుడు ప్రముఖ న్యాయవాది బోండా రవితేజ కూడ ఈ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ కి విచ్చేశారు. ఈ సందర్భంగా కేశినేని చిన్ని మాట్లాడుతూ TNSF ఆధ్వర్యంలో విజయవాడలో జరుగుతున్న క్రికెట్ టోర్నమెంట్ విజయవంతంగా నిర్వహించిన పులగూర చరణ్ సాయి యాదవ్, TNSF నాయకులను అభినందించారు. క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా TNSF ఈ టోర్నమెంట్ ని నిర్వహించినందుకు వారిని ప్రత్యేకంగా అభినందించారు. అలాగే కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా స్థాయిలో క్రికెట్ టోర్నమెంట్ ని నిర్వహిస్తామని, మొదటి దశలో నియోజకవర్గస్థాయిలో పోటీలను నిర్వహించి అందులో విజేత అయినటువంటి టీములను జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా అనేక పోటీలను, క్రీడలను అభివృద్ధి చేసే కార్యక్రమాలను, క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా పలు కార్యక్రమాలను ఫౌండేషన్ నిర్వహిస్తుందని ఆయన తెలియజేశారు. ఈ టోర్నమెంట్లో పాల్గొన్న క్రీడాకారులు అందరికీ అభినందనలు తెలియజేసారు. అనంతరం జరిగిన బహుమతి ప్రధాన కార్యక్రమంలో కేశినేని చిన్ని విన్నర్స్ మరియు రన్నర్స్ కు బహుమతులు అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ నిర్వహకుడు TNSF జిల్లా ప్రధాన కార్యదర్శి పుల్లగూర చరణ్ సాయి యాదవ్, TNTUC రాష్ట్ర ఉపాధ్యక్షులు పరుచూరి ప్రసాద్, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి పత్రి రాఘవ, సెంట్రల్ నియోజకవర్గ TNSF అధ్యక్షులు శంకర మనోజ్, TNSF నాయకులు గరిమెళ్ళ సాయి తేజ, నరేంద్ర, శ్రీకాంత్, శ్రీను, యువ కిషోర్ తదితరులు పాల్గొన్నారు….
Prajavartha Online Telugu News