తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
వరల్డ్ రెమెంబెరన్స్ డే కార్యక్రమాన్ని ట్రాన్స్పోర్ట్ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వారు చాల గొప్పగా స్థానిక రామచంద్ర పుష్కరిణియందు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు ఆక్సిడెంట్ భాతితులకు 2౦౦౦ ఆర్థిక సహాయం అందజేశారు. అలానే మాట్లాడుతూ మనిషి ప్రాణం చాలా విలువయినవని, ప్రయాణాళ్ళలో హెల్మెట్ , కార్ సీట్ బెల్ట్ ధరించుట చాల మంచిదని తెలియచేసారు. కుటుంబంలో ఏ ఒక్కరు మరణించిన , భాదని ఎవ్వరు పూడ్చలేరని తెలియచేసారు. అనంతరం ఆక్సిడెంట్ లో మరణించిన బాధితులకు మౌనంపాటించి , కొవ్వుతుల నివాళి మానవ హారంగా ఏర్పడి నివాళి అర్పించారు. కార్యక్రమంలో కే. సీతారాం రెడ్డి , డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ , కులశేఖర అడిషనల్ సూపరింటెండెంట్ అఫ్ పోలీస్, ట్రాఫిక్ డీస్పీ లు కాటంరాజు , విజయశేఖర్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు సుబ్రహ్మణ్యం, శ్రీనివాస రావు, చంద్రశేఖర్, దామోదర్ నాయుడు, కుసుమ, స్వర్ణలత తదితరులు పాల్గొని ప్రమాద బాధితులకు నివాళి అర్పించారు
Prajavartha Online Telugu News