-నిరుపేదలకు ఉత్తమ సేవలు అందిస్తున్న ఫ్యామిలీ డాక్టర్లే ప్రత్యక్ష దేవుళ్ళు..
-జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పేద ప్రజలకు వైద్య సేవలను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ఫ్యామిలీ ఫిజీషియన్ విధానం అమలు జరుగుతున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు పేర్కొన్నారు.
ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫ్యామిలీ ఫిజిషియన్ విధానం అమలులో పిహెచ్‌సి స్థాయిలో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తున్న వైద్యులను సోమవారం కలెక్టరేట్ పింగళివెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు సన్మానించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ పేదలకు మారుమూల గ్రామాలలో అకింత భావంతో వైద్యులు మెరుగైన సేవలు అందించడం అభినందనీయమన్నారు. ఇప్పటివరకు ఫ్యామిలీ డాక్టర్ సేవలు సంపన్నవర్గాలు మాత్రమే ఉపయోగించుకునేవారన్నారు. పేద ప్రజలకు కూడా అంటువంటి సేవలను అందించాలనే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫ్యామిలీ ఫిజిషియన్ విధానానికి శ్రీకారం చుట్టి అమలు చేస్తున్నారన్నారు. నడవలేని స్థితిలో వైద్య సేవల కొరకు ఆసుపత్రులకు చేరుకోలేని వారికి నేరుగా గడప వద్దకే వైద్య సేవలను అందించడమే ఫ్యామిలీ ఫిజిషియన్ విధానం లక్ష్యమన్నారు.ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఇద్దరు వైద్యుల బృందాన్ని ఏర్పాటు చేసి వారిలో ఒకరు ఆరోగ్యకేంద్రానికి వచ్చే రోగులకు వైద్యం అందిస్తూ మరొకరు గ్రామీణ స్థాయిలో పర్యటిస్తూ డాక్టర్ వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్ ద్వారా ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తున్నారన్నారు. జిల్లా వ్యాప్తంగా 23 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని 239 వైస్సార్ హెల్త్ క్లినిక్‌ల ద్వారా ఫ్యామిలీ ఫిజిషియన్ సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు. ప్రతి గ్రామ సచివాలయ పరిధిలో ఫ్యామిలీ ఫిజిషియన్ విధానం ద్వారా వైద్యులు, సిబ్బంది 104 వాహనం ద్వారా గ్రామాలలో పర్యటించి ఇంటింటికి వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. ఫ్యామిలీ ఫిజిషియన్ ద్వారా 67 రకాల మందులు అందుబాటులోఉంచారని 14 రకాల డయాగ్న స్టిక్ మెడికల్ పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారన్నారు. జిల్లాలో ఏ కొండూరు మండలంలోని గ్రామాలలో క్రానిక్ కిడ్నీ డిసీజస్ పై కూడా కేసులు నమోదు అవుతున్న దృష్ట్యా తండాలలో కూడా వైద్య పరీక్షలు నిర్వహించి అవగాహన కల్పించి ఫ్యామిలీ ఫిజిషియన్ సేవలను విసృత్తం చేయాలన్నారు.
ఈ సందర్భంగా నెల రోజుల నుండి జరుగుతున్న ఫ్యామిలీ ఫిజిషియన్ వైద్య సేవలలో ఉత్తమ సేవలు అందిస్తూ ముందంజలో ఉన్న ఇబ్రహీంపట్నం జూపూడి, రెడ్డిగూడెం మండలం రంగపురం, చంద్రాల లోని మైలవరం పిహెచ్‌సి`4, ఏ కొండూరు మండలం కోడూరు, జి. కొండూరు మండలం చెరువు, మాదవరం, ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో విధులు నిర్వర్తిస్తున్న డా. సుధాప్రసూజ, డా. సందేష్, డా. నరేష్, డా. దివిజ, డా. కార్తీక్‌లను కలెక్టర్ ఘనంగా సన్మానించారు.
సమావేశంలో డిఆర్‌వో కె. మోహన్‌కుమార్, టైనీ డిప్యూటి కలెక్టర్లు ఎస్. రామలక్ష్మి, ఖతీఫ్ కౌసర్ బానో, డియంహెచ్‌వో డా. యం సుహాసిని, డిప్యూటి డియంహెచ్‌వో డా. నళినిదేవి, ఆరోగ్యశ్రీ జిల్లా కో`ఆర్డినేటర్ డా. సుమన్ ఉన్నారు.
Prajavartha Online Telugu News