విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
చంద్రబాబు నాయుడు మీద వైసిపి నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతున్నారని వారికి రాబోయే కాలంలో బుద్ది చెబుతామని తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ కార్యదర్శి, మాజీ ఫ్లోర్ లీడర్ కొట్టేటి హనుమంతరావు అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కేశినేని ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్ట్ కేశినేని శివనాథ్ (చిన్ని) కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొట్టేటి హనుమంతరావు మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి దశలో పయనింపజేసిన చంద్రబాబు నాయుడు ని విమర్శించే నైతిక హక్కు ఈ వెల్లంపల్లి శ్రీనివాస్ కి కానీ స్పీకర్ గా పనిచేస్తూ రాజకీయాలు మాట్లాడకూడదని తెలియని తమ్మినేని సీతారాం కానీ దువ్వాడ శ్రీనివాస్ కి కానీ లేదు అని ఆయన అన్నారు. రాజకీయాల్ని వ్యాపారమయంగా మార్చి ప్రజలపై భారల మీద భారాలను మోపుతూ రాష్ట్రాన్ని అధోగతి పాలన చేస్తున్నారన్నారు. ఈ మూడున్నర సంవత్సరాల కాలంలో మీ ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలకు ఎంత మేలు చేసిందో చెప్పడం మానేసి చంద్రబాబు నాయుడు మీద విమర్శలు చేయడం అంటే సూర్యుని మీద ఉమ్మేసినట్టే అని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తూ మా నాయకుడి మీద అవాక్కులు చవాకులు పేలితే ఊరుకునే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు. నియోజకవర్గంలో ప్రజలు ఈ వైసిపి నాయకులందరినీ ఎప్పుడో మర్చిపోయారని 2024 ఎన్నికల్లో ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్నారని, కచ్చితంగా వీరందరికీ తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో ప్రజలు బుద్ధి చెబుతారని ఆయన తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ భిక్షతో పదవులు అనుభవించి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీద చంద్రబాబు నాయుడు గారి మీద ఇష్టా రీతిగా మాట్లాడుతున్న వీరందరికీ కచ్చితంగా బుద్ధి చెప్పటం ఖాయమని ఆయన హెచ్చరించారు. రాబోయే కాలంలో వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజల కాలగర్భంలో కలిపేయటం ఖాయమని 2024 లో జరగబోయే ఎన్నికలే ఈ వైసీపీకి చివరి ఎన్నికలని అది గుర్తుపెట్టుకోవాలని ఆయన అన్నారు.విజయవాడ తెలుగుదేశం పార్టీ అర్బన్ మైనార్టీ సెల్ మాజీ అధ్యక్షులు మహమ్మద్ ఇర్ఫాన్ మాట్లాడుతూ మైనారిటీలను మోసం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని మైనారిటీలను రక్షించాల్సింది పోయి మైనారిటీలను మీద దాడులు చేపిస్తూ ఉన్న పథకాలను తీసేస్తూ, ఆ విధంగా పాలన కొనసాగిస్తున్నాడని ఆయన అన్నారు. వెల్లంపల్లి శ్రీనివాస్ పశ్చిమ నియోజకవర్గంలో మైనారిటీలకు ఏం చేశారు ఎంతమందికి మైనారిటీలకు సంక్షేమ పథకాలు అందించారు చెప్పగలరా అని ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు హయాంలో మైనార్టీలకు ఒక స్వర్ణ యుగం లాగా పాలన కొనసాగిందని ఖచ్చితంగా ఆ పాలన కోసం మైనార్టీ సోదరులందరూ ఎదురుచూస్తున్నారని ఆయన అన్నారు.
Prajavartha Online Telugu News