Breaking News

ప్రజల ఆలోచనలు,ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వ పాలన : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి  ప్రజల ఆలోచనలు, ఆకాంక్షలకు అనుగుణంగా జనరంజకంగా పాలన అందిస్తున్నారని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. గురువారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 4వ డివిజన్ 16వ సచివాలయం పరిధిలో నాయకులు, సచివాలయ సిబ్బంది, వలంటీర్ లతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ క్యాలెండర్ ను అందజేసీ ఈ ప్రాంతంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు గురుంచి వివరించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ఈ వరలక్ష్మి నగర్ ప్రాంతంలో దాదాపు 150 కుటుంబాలు నివాసిస్తుంటే ప్రతి కుటుంబానికి కూడా ఈ ప్రభుత్వం లో ఏదో ఒక సంక్షేమ పధకం అందింది అని, ఇంటింటికి అర్హతను బట్టి సంక్షేమ లబ్ది అందించిన సచివాలయ సిబ్బందికి, వలంటీర్లను అభినందించారు. నెల మొదటి రోజునే వలంటీర్లు ఇంటికి వచ్చి పెన్షన్ అందిస్తున్నారని అవ్వతాత లు వారి సంతోషం వ్యక్తం చేస్తున్నారు అని,గతంలో అయితే అవస్థలు పడుతూ చాలా దూరం వెళ్లి రోజంతా వేచి చూస్తే గాని వచ్చే పరిస్థితి ఉండేది కాదని చెబుతూ ముఖ్యమంత్రి జగనన్న కు తమ ఆశీస్సులు అందిస్తున్నారు. వరలక్ష్మి నగర్ ప్రజల చిరకాల కోరిక కమ్యూనిటీ హల్ నిర్మాణ పనులు గత తెలుగుదేశం ప్రభుత్వం లో ఎమ్మెల్యే, కార్పొరేటర్ కుమ్మక్కై వారి సన్నిహితులకు కాంట్రాక్టు ఇప్పించుకొని నిధులు మింగేసి సగంలో పనులు ఆపేశారని విమర్శించారు. వైస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఇన్ ఛార్జ్ గా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఇక్కడి కాలనీ పెద్దలు కమ్యూనిటీ హల్ సమస్యను మా దృష్టికి తీసుకువచ్చారని, వెంటనే సంబంధిత మంత్రి, మున్సిపల్ కమిషనర్ లతో మాట్లాడి భవన నిర్మాణనికి నిధులు మంజూరు చేపించడం జరిగిందని అన్నారు. ఇప్పుడు పనులు మొదలు అయ్యాక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వచ్చి తన నటనతో అది తన ఘనత గా ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటు అని, నిజంగా మీకు అంత చిత్తశుద్ధి ఉంటే అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. అదే పనిగా అబద్ధాలు ప్రచారం చేసి అవే నిజాలుగా నమ్మించాలి అని మీరు చేసే షో రాజకీయాలు ప్రజలకు తెలుసని వారే మీకు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఇచ్చిన హామీ మేరకు వీలైనంత త్వరగా భవన నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తామని అవినాష్ హామీ ఇచ్చారు. అదేవిధంగా ఈ ప్రాంతావాసుల ముఖ్య సమస్య ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ గురుంచి కూడా ముఖ్యమంత్రి గారికి వివరించడం జరిగిందని ఆ సమస్య కూడా త్వరలోనే పరిష్కారం అవుతుంది అని భరోసా ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఇదేమి ఖర్మ అంటూ మరో నాటకానికి తెరలేపారని ప్రజలు మీ గురుంచి అలా అనుకోబట్టే గత ఎన్నికల్లో ,ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘోరంగా ఓడించారని ఎద్దేవా చేశారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, గల్లా రవి,ప్రకాష్,జయ రాజు,మహేష్,విజయ్ కుమార్, డేవిడ్, జాకబ్, భరత్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలు…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో బుధవారం జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *