Breaking News

ఏపీ ఎన్జీఓస్ జగ్గయ్యపేట నూతన అధ్యక్ష కార్యదర్శిగా వెంకట్రావు, బాబూరావు

-ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి- ఎన్జీవో నేత ఎ విద్యాసాగర్

జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉపాధ్యాయులకు పెన్షనర్లకు సంబంధించిన అనేక సమస్యలు పెండింగులో ఉన్నాయని గత రెండు సంవత్సరాలుగా పరిష్కారానికి నోచుకోక ఎక్కడ వేసిన గొంగల్లా అక్కడే పడి ఉన్నాయని ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ అంశాలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కారం చేయాలని ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ పశ్చిమ కృష్ణ జిల్లా అధ్యక్షుడు ఏ విద్యాసాగర్ కోరారు .

జగ్గయ్యపేట ఎన్జీవో హోమ్ లో శనివారం జరిగిన జగ్గయ్యపేట నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు ఏ విద్యాసాగర్ విచ్చేశారు. ఎ విద్యాసాగర్ మాట్లాడుతూ ప్రస్తుతం నాయకత్వలపై గురుతర బాధ్యత ఉన్నదని పి ఆర్ సి అంశాలు, డిఎ పెండింగ్ అంశాలు, డిఏ బకాయిల విడుదల, పెండింగ్ బిల్లులు చెల్లింపు వంటి అంశాలన్నీ అపరిస్కృతంగా ఉన్నాయని వీటన్నిటిని ఉద్యోగులకు సాధించి పెట్టె క్రమంలో నాయకత్వం మీద గురతర బాధ్యత ఉన్నదని నూతనంగా ఎన్నికైన నాయకత్వం అటువంటి గురుతుర బాధ్యతలను నిర్వహించాలని ఆయన అన్నారు. ఎన్నికల అధికారి సిహెచ్ శ్రీరామ్ మాట్లాడుతూ జగ్గయ్యపేట ఏపీ ఎన్జీవోస్ నామినేషన్లు ఉదయం తొమ్మిది గంటల నుండి మద్యాహ్నం 12.30 వరకు స్వీకరించామని,, పదకుండు పదవులకు గాని, పదకుండు నామినేషన్లు రావడంతో బి వెంకట్రావు, టి బాబూరావు ప్యానెల్ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికైయ్యారని తెలిపారు. అధ్యక్షుడుగా బి వెంకట్రావు కార్యదర్శిగా టి బాబూరావు కోశాధికారిగా కె సంక్రాంతి, సహధ్యక్షుడిగా యం విజయవర్ధన్, ఉపాధ్యక్షులుగా వి శివకోటేశ్వరరావు, ఏ కుమార్, వై వనజాక్షి, సంయుక్త కార్యదర్శులుగా వి అనిత, జోగి కటక్షం, ఎ సాంబిరెడ్డి, మహిళ సంయుక్త కార్యదర్శిగా బి ఉషారాణి ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గానికి జిల్లా అధ్యక్షుడు ఎ విద్యాసాగర్, జిల్లా కార్యదర్శి యం డి ఇక్బాల్ మరియు జిల్లా కమిటీ సభ్యులు అభినందనలు తెలిపారు. జగ్గయ్యపేట ఎన్జీవోస్ ఎన్నికలలో ఎన్నికల అధికారిగా సిహెచ్ శ్రీరామ్ సహాయ ఎన్నికల అధికారిగా బివివిఆర్ నాగేంద్ర ఎన్నికల పరిశీలికలుగా యం రాజుబాబు వ్యవహరించారు. వీరితో జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసరావు,జి రామకృష్ణ విజయవాడ నగరశాఖ అధ్యక్షుడు జె స్వామి, సీవీఆర్ ప్రసాద్ మరియు ఉద్యోగులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *