Breaking News

ఎమ్మెల్యే మల్లాది విష్ణుకి ప్రభుత్వ ఆయుర్వేద మెడికల్ కళాశాల సిబ్బంది ఘన సత్కారం

-అడ్మిషన్ల పునరుద్ధరణలో మల్లాది విష్ణు చూపిన చొరవ మరువలేనిది: కళాశాల సిబ్బంది

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గవర్నర్ పేట లోని డాక్టర్ నోరి రామశాస్త్రి ప్రభుత్వ ఆయుర్వేదిక్ కళాశాల సిబ్బంది బుధవారం ఆంధ్రప్రభ కాలనీలోని జనహితసదనములో రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుని మర్యాదపూర్వకంగా కలిశారు. కళాశాలలో అడ్మిషన్ల పునరుద్ధరణకు ఆయన అందించిన సహాయ సహకారాలకుగానూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా దుశ్శాలువతో ఘనంగా సత్కరించారు. ప్రభుత్వ ఆయుర్వేద మెడికల్ కళాశాల నందు ఈ ఏడాది అడ్మిషన్లు నిలిచిపోవడంతో.. కళాశాల సిబ్బంది మల్లాది విష్ణుని కలిసి సమస్యను విన్నవించడం జరిగింది. స్పందించిన ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్., కమిషనర్ ఆఫ్ ఆయుష్, మినిస్టరీ ఆఫ్ ఆయుష్ – న్యూఢిల్లీతో మాట్లాడటం జరిగింది. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అడ్మిషన్లు పున: ప్రారంభించాలని కోరగా.. 2022-23 విద్యా సంవత్సరానికి 75 అండర్ గ్రాడ్యుయేషన్, 25 పోస్ట్ గ్రాడ్యుయేషన్ సీట్లకు అనుమతినిస్తూ కేంద్ర ప్రభుత్వం, మినిష్టరీ ఆఫ్ ఆయుష్ ఈనెల 28న ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఎమ్మెల్యే చూపిన ప్రత్యేక చొరవతోనే తమ చదువు నిర్విఘ్నంగా కొనసాగనున్నట్లు విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. కళాశాలకు సంబంధించి ఎటువంటి సహాయ సహకారాలు అందించేందుకు ఎల్లప్పుడూ తాను సిద్ధంగా ఉంటానని మల్లాది విష్ణు తెలియజేశారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో కళాశాల ప్రిన్సిపల్ టి. సాయి సుధాకర్, సెక్రటరీ జె.ధనుంజయరావు, NMA ప్రెసిడెంట్ డా.జి.చినరాజు, NMA పెద్దలు, కళాశాల సిబ్బంది, విద్యార్థులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *