విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపరిచిన హామీలన్నింటిని అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దే అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. గురువారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 4వ డివిజన్ 7వ సచివాలయం పరిధిలోని భారతి నగర్ 13,14 మరియు 15 వ వీధులలో వైస్సార్సీపీ నాయకులు,సచివాలయ సిబ్బంది,వాలంటీర్ తో కలిసి ఇంటింటికి వెళ్లిన అవినాష్ ప్రభుత్వం వారి కుటుంబాలకు అందుతున్న సంక్షేమ పథకాలు వివరాలను అందజేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ వైస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతే నవరత్నాలతో పేదల బ్రతుకుల్లో వెలుగులు నిండాయని, వారికి ఆర్థిక భరోసా కల్పించే దిశగా ప్రభుత్వ పాలన కొనసాగుతుంది అని అన్నారు. స్వర్గీయ దేవినేని నెహ్రూ ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు ఈ డివిజన్ లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని మరలా నేడు జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యాక మాత్రమే అభివృద్ధి చూస్తున్నామని ఇక్కడి కాలనీ పెద్దలు, ప్రజలు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు అని అన్నారు. కేవలం ఈ మూడేళ్ళ కాలంలోనే కోట్ల రూపాయల నిధులు వెచ్చించి కాలనీ పెద్దల సహకారంతో నూతన రోడ్లు, సైడ్ డ్రైనేజ్, పార్కుల నిర్మాణం చేపట్టడం జరిగిందని, పెద్దలు మా దృష్టికి తీసుకువచ్చిన ప్రతి సమస్యను పరిష్కారాయించామని తెలిపారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి చెందిన సరే పద్మావతి గారు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ప్రతి హామీ అమలుకు కృషి చేస్తున్నారు అని కొనియాడారు. ప్రజలలో రోజురోజుకు జగనన్న కు పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక వారి పార్టీ భవిత్యం మీద బెంగతో ప్రతిపక్ష పార్టీలు పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారు అని విమర్శించారు. వారు ఎన్ని కుట్రలు చేసిన, ఎంత అసత్య ప్రచారాలు చేసిన ప్రజలు నమ్మే పరిస్థితి లేదని వారి సంపూర్ణ మద్దతు ప్రభుత్వనికి ఉందని ధీమా వ్యక్తంచేశారు. ఇదేమి ఖర్మ అని ప్రజలు అనుకోబట్టే టీడీపీ ని ఘోరంగా ఓడించారని, మీరు ఎన్ని జిమ్మిక్కులు చేసిన మీ పార్టీ కోలుకోవడం కష్టమేనని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబాన్ని తన సొంత కుటుంబంలా భావించి జగనన్న అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నారు అని అన్నారు.గతంలో పెన్షన్ తీసుకోవాలి అంటే అవ్వాతాత లు కార్యాలయాల చుట్టూ కళ్ళారిగెల తిరిగిన ఎప్పుడూ ఇస్తారో తెలియని పరిస్థితి అని కానీ నేడు జగనన్న ప్రవేశపెట్టిన వలంటీర్ వ్యవస్థ ద్వారా 1వ తేదీ రాగానే పొద్దున్నే వాలంటీర్లు ఇంటి వద్దకే వచ్చి పెన్షన్లు అందిస్తున్నారని ప్రజలు వారి సంతోషం వ్యక్తం చేస్తున్నారు అని అన్నారు.ఈ కార్యక్రమంలో 4వ డివిజన్ ఇంచార్జ్ గల్లా పద్మావతీ,డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,మీర్ హుస్సేన్,గల్లా రవి,జె.జె.సింగ్,వెంకటేశ్వర రావు,రామారావు,రామచంద్ర రెడ్డి,నర్రా పద్మ,దండమూడి రామారావు తదితరులు పాల్గొన్నారు.
దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రూ.35,000/- విలువ చేసే తోపుడు మరియు టిఫిన్ బండ్లు వితరణ
రాజకీయాలకు అతీతంగా దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విజయవాడలో ఆపదలో అవసరార్ధం ఉన్న నిరుపేదలకు విద్య,ఉపాధి, వైద్య రంగాలలో అండగా నిలుస్తు గురువారం నాడు 4వ డివిజన్ భారతీనగర్ కి చెందిన నిరుపేద కుటుంబాలకు చెందిన ఊటుకూరి దుర్గారావు మరియు గొర్ల నాగమణి లకి రూ.35,000/- విలువ చేసే టిఫిన్ బండి మరియు తోపుడు బండ్లు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది అని తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. అద్దె బండ్ల తో వారి జీవనోపాధి కొరకు కష్ట పడుతున్న విషయం స్థానిక వైస్సార్సీపీ నాయకులు అవినాష్ దృష్టికి తీసుకురాగా వారికి దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అందజేశారు.
Prajavartha Online Telugu News