విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు నియోజకవర్గ వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డిసెంబర్ 7వ తేదీ వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జయహో బి.సి. మహాసభ కార్యక్రమ వాల్ పోస్టర్లను బి.సి. నాయకులతో కలసి ఆవిష్కరించిన తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్. ఈ సందర్భంలో అవినాష్ మాట్లాడుతూ బి.సి. లంటే బ్యాక్ వర్డ్ కాస్ట్ కాదు, బ్యాక్ బోన్ క్యాస్ట్ అని, అన్ని రంగాలలో ప్రాధాన్యత కల్పించిన నాయకుడు ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారు అని అన్నారు.బి.సి.ల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటుచేసి, నేడు ఏ ముఖ్యమంత్రి ఇవ్వని అనేక పదవులు బి.సి. లకు కల్పించిన ఏకైక ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారు.దేశంలో ఏరాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా బి.సి. లకు వేన్నుముకగా ఉండి, బి.సి. లను అన్ని రంగాలలో ముందుకు తీసుకువెళ్తున నాయకుడు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి గారు.బి.సి. లకు చేసిన అనేక సంక్షేమ మరియు పదవులను మనం గుర్తు చేసుకోవాలి. ఇటువంటి గొప్ప నాయకుడు ఏర్పాటుచేసిన బి.సి. మహా సభకు విచ్చేసి, మనమంతా సభను విజయవంతం చేద్దాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో భట్రాజు కార్పొషన్ ఛైర్మన్ గీతాంజలి,డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, ఫ్లో రీడర్ వెంకట సత్యనారాయణ, బీసీ నాయకులు చలపాటి వెంకటేశ్వరరావు,దుర్గారావు,సుజాత,సుబ్బరాజు,రామకృష్ణ,రహేన నహీద్ మరియు బి.సి ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News