-రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన తూర్పు కాపుల సంక్షేమానికి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తున్నట్లు ఏపీ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. నియోజకవర్గ తూర్పు కాపు సామాజికవర్గం నాయకులు బుధవారం ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనము నందు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో తూర్పు కాపు సామాజిక వర్గం ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారం కోరుతూ.. ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర జనాభాలో తూర్పు కాపులు అత్యధికంగా 30 లక్షల మంది ఉన్నారని.. వారికి సామాజికంగా, ఆర్థికంగా ఈ ప్రభుత్వం అండగా నిలిచినట్లు మల్లాది విష్ణు తెలిపారు. తూర్పు కాపుల సంక్షేమానికి ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత ఒక్క సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. జనాభా థామాషా ప్రకారం విరివిగా నిధులు మంజూరు చేయిస్తూ.. వారి సంక్షేమానికి వినియోగిస్తున్నట్లు తెలియజేశారు. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి.. పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని మల్లాది విష్ణు తెలియజేయడంతో సంఘ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో నాయకులు ఆర్.ఎస్.నాయుడు, మీసాల సత్యనారాయణ, అలుగోలు కరుణాకర్ నాయుడు, ఆర్.వి.చినబాబు, వి.బి.ఆచారి తదితరులు ఉన్నారు.
Prajavartha Online Telugu News