విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ భవానిపురం లో శక్తి గ్రాండ్ లో గురువారం మద్దిరాల పోలిరెడ్డి సంస్మరణ సభకి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులు ఎండీ రుహుల్లా హాజరయ్యారు. అనంతరం ఆయన సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ పార్టీ బలోపేతం కోసం పార్టీ ఆవిర్భావం నుండి కృషి చేసిన వ్యక్తి మద్దిరాల పోలిరెడ్డి అని తెలిపారు విజయవాడ నగరంలో పశ్చిమ నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కోసం అనేక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారు అని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వారి కుటుంబానికి అన్నివేళలా అండగా ఉంటామని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ వారికి హామీ ఇచ్చారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరిని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గుర్తించుకుంటుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ప్రజాసేవలో కూడా వారి కుటుంబ సభ్యులు అన్నివేళల ముందున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్ పర్సన్ బండి పుణ్యశీల, స్థానిక కార్పొరేటర్లు ఆంజనేయ రెడ్డి, షేక్ ఇర్ఫాన్, మైలవరపు రత్నకుమారి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి అవుతూ శ్రీనివాస్ రెడ్డి, విజయవాడ నగరం నుండి పలు హోదాలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News