విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గాంధీనగర్ సర్ విజ్జీ స్విమ్మింగ్ పూల్ ఘటనలో అస్వస్థతకు గురైన చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆదేశించారు. పాత ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను గురువారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఎవరికీ ఎటువంటి ప్రమాదం లేదని తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. అలాగే కొత్త ఆస్పత్రిలో చికిత్స పొంది డిశ్చార్జి అయిన చిన్నారుల గూర్చి వాకబు చేశారు. అత్యవసరమైతే ఏ సమయంలోనైనా తనను సంప్రదించవచ్చని.. స్పందించడానికి తాను సిద్ధమని తెలియజేశారు.
Prajavartha Online Telugu News