Breaking News

ఎంపిఎఫ్‌ సిగోడౌన్‌లకు భూ సేకరణ వేగవంతం

-జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో బహుళ ప్రయోజన కేంద్రాల (మల్లీ పర్సస్‌ ఫెసిలిటి సెంటర్స్‌) నిర్మాణ పనులను వేగవంతం చేస్తున్నామని రాష్ట్ర సహకార శాఖ కమీషనర్‌ బాబు ఏ కి జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు వివరించారు. గురువారం సచివాయలం నుండి ఎంపిఎఫ్‌సి గోడౌన్‌లకు భూసేకరణ, నిర్మాణం, తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్‌లు, జాయింట్‌ కలెక్టర్‌లతో రాష్ట్ర సహకార శాఖ కమీషనర్‌ బాబు ఏ వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. నగరంలోని కలెక్టర్‌ క్యాంప్‌ కార్యాలయం నుండి వీడియోకాన్ఫరెన్స్‌కు జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు, జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ నూపూర్‌ అజయ్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ మల్లీ పర్సస్‌ ఫెసిలిటి సెంటర్స్‌ (ఎంపిఎఫ్‌సి) గోడౌన్‌లకు సంబంధించి జిల్లాలో మొదటి విడత మంజూరైన 58 గోడౌన్‌ల నిర్మాణానికి సంబంధించి 53 గోడౌన్‌ల పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. ఎప్పటికప్పుడు సోసైటీలకు బిల్లులను పెండిరగ్‌ లేకుండా చెల్లింపులు చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రెండవ విడతలో మంజూరైన 50 ఎంపిఎఫ్‌సి గోడౌన్ల నిర్మాణాలకు గాను 37 కేంద్రాలకు, మూడవ విడతలో మంజూరైన 21 గోడౌన్‌లకు 19 కేంద్రాలకు సంబంధించి ఇప్పటికే భూ సేకరణ పూర్తి చేశామని, మిగిలిన వాటికి సంబంధించి భూ సేకరణ త్వరితగతిన చేపడుతున్నామని కలెక్టర్‌ డిల్లీరావు రాష్ట్ర సహకార శాఖ కమీషనర్‌ బాబు ఏ కి వివరించారు. వీడియోకాన్ఫరెన్స్‌లో డిస్ట్రిక్ట్‌ కోఅపరేటివ్‌ ఆఫీసర్‌ సిహెచ్‌ శైలజ, మార్కెటింగ్‌ ఏడి కిషోర్‌లు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *