Breaking News

రాష్ట్రంలో జిల్లా ప్రథమ స్థానం… : కలెక్టర్ డా కె. మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద ఈరోజు వరకు 39,41,101 పని దినాలు కల్పించడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల లో ఉన్న పేదవారికి, కొద్దిపాటి నైపుణ్యం కలిగిన వారికి పనులు కల్పించే ఉద్దేశంతో జాతీయ ఉపాధిహామీ పథకం అమలు చేయడం జరుగుతొందని పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా కి 2022-23 సంవత్సరానికి 37 లక్షల ఉపాధి హామీ పని దినాలు కల్పించడం లక్ష్యం కాగా ఇప్పటికే 39.41 లక్షలు (106.51) లక్ష్యాలను సాధించి రాష్ట్రంలో జిల్లాను ప్రథమ స్థానంలో నిలపడం జరిగిందన్నారు.

ఉపాధి హామీ పథకం అమలులో జిల్లాను అగ్రస్థానం లో నిలపడం తో సగటు వేతనం అందచేసే క్రమంలో, మరిన్నీ పని దినాలు కల్పన ఉద్దేశ్యంతో మార్కులను కేటాయించడం జరిగిందని పేర్కొన్నారు. జిల్లాలో నూరుశాతం లక్ష్యాలను ఛేదించే క్రమంలో డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ రామ్ మోహన్ మండల స్థాయి అధికారులు, సిబ్బందితో టెలికాన్ఫెరెన్స్ లో పాల్గొన్నారు.

మరింత మెరుగైన ఫలితాలు సాధించే క్రమంలో మండలాలు వారీగా క్షేత్ర స్థాయి అధికారుల, సిబ్బంది పనితీరు ను సమీక్షించడం జరిగిందని ఆమేరకు ఆయా మండలాల పనితీరు పై ప్రాజెక్ట్ డైరెక్టర్ జి ఎస్ రామ్ గోపాల్ ద్వారా సర్క్యులర్ జారీ చేశామన్నారు.

జిల్లా పరిధిలో మండలాల పనితీరు ఆధారంగా మార్కులు కేటాయించినట్లు మాధవీలత తెలియచేశారు. జిల్లాలో సగటున డెల్టా ప్రాంతంలో 95 శాతం మేర, మెట్ట ప్రాంతాల్లో 84 శాతం మేర మార్కులు సాధించడం జరిగిందని అన్నారు. ఉపాధిహామీ పనిదినాలు కల్పించడం లో మెట్ట ప్రాంతం లో ఉన్న మండలాలు గోకవరం 394211 పనిదినాలు, సగటు వేతనం రూ.231 లతో 87 మార్కులు ఇచ్చినట్లు, అదేవిధంగా తరువాత స్థానాల్లో రాజానగరం లో 372930 పనిదినాలు రూ.235 సగటు వేతనం తో 87 మార్కులు, బిక్కవోలు 246988 పని దినాలు రూ.245 సగటు వేతనం వల్ల 80 మార్కులు ఇవ్వడం జరిగిందన్నారు. డెల్టా ప్రాంతంలో మండలాలు ఉండ్రాజవరం లో 1,10,579 పనిదినాలు రూ.238 సగటు వేతనంతో 117 మార్కులు, నిడదవోలు లో 183512 పనిదినాలు రూ.230 సగటు వేతనంతో 112 మార్కులు, చాగల్లు లో 176190 పనిదినాలు రూ.241 సగటు వేతనంతో 110 మార్కులతో మెరుగైన పురోగతి సాధించారన్నారు.

ఉపాధి హామీ పథకం లో తక్కువ పురోగతి సాధించి దిగువ స్థాయి లో ఉన్న మండలాల్లో మెట్ట ప్రాంతాల్లో ఉన్న రాజమహేంద్రవరం రూరల్ లో 89,662 పనిదినాలు రూ. 218సగటు వేతనంతో  56 మార్కులు, దేవరపల్లి లో 191044 పని దినాలు రూ.194 సగటు వేతనంతో 58 మార్కులు, కోరుకొండ 289982 పని దినాలు రూ.212 సగటు వేతనంతో  68 మార్కులు, నల్లజర్ల లో 274069 పనిదినాలు రూ.206 సగటు వేతనంతో 68 మార్కులు సాధించిన ట్లు కలెక్టర్ తెలిపారు. డెల్టా మండలాల్లో కడియం లో 46,764పని దినాలు రూ.246 సగటు వేతనంతో 82 మార్కులు, సీతానగరం లో 259520 పని దినాలు రూ.229 సగటు వేతనంతో  87 మార్కులు, కొవ్వూరు 154739 పనిదినాలు రూ.234 సగటు వేతనంతో 91 మార్కులు, తాళ్లపూడి లో 102397 పని దినాలు రూ.221 సగటు వేతనంతో 91 మార్కులను ఇవ్వడం జరిగిందన్నారు.

డెల్టా ప్రాంతంలో ఉపాధిహామీ పథకం కింద మరిన్ని పని దినాలు, సగటు వేతనం పెంచే విధంగా తగిన ప్రతిపాదనలు, ప్రణాళికలు తయారు చేయాలని ఆదేశించడం జరిగిందన్నారు. తక్కువ పని తీరు చూపుతున్న మండలాల పై ప్రత్యేక దృష్టి పెట్టడం జరుగుతుందని డ్వామా పీడీ జీ ఎస్ రాం గోపాల్ పేర్కొన్నారు.  అదే సమయంలో సగటు ఉపాధి హామీ వేతనం అందచేసే క్రమంలో చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అవుట్‌ఫాల్ డ్రెయిన్ల డీసిల్టింగ్ పనులను పరిశీలించిన కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *