Breaking News

మాదిగల సమస్యకు పరిష్కారం చూపాలి… : ఆర్‌.జె. ప్రకాష్‌ మాదిగ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు సమావేశం జరిగింది. సోమవారం గాంధీనగర్‌లోని ప్రెస్‌క్లబ్‌లో జరిగిన ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.జె.ప్రకాష్‌ మాదిగ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం షెడ్యూల్‌ కులాల రిజర్వేషన్ల విభజన చట్టం పార్లమెంటులో ప్రవేశపెట్టడంలో విఫలమయ్యారని, అధికారంలో వస్తే 100 రోజుల్లో చట్టం చేసి చట్టబద్ధత కల్పిస్తామన్న దేశ ప్రధాని నరేంద్ర మోడీ మాదిగలకు మాయ మాటలు చెప్పినట్లు అర్థం అవుతుందని అన్నారు. దేశంలో ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ మాదిగలకు అన్యాయం జరగకుండా మానవత్వంతో ఆలోచించి సమస్యకు పరిష్కారం చూపాలని అన్నారు. రాష్ట్రం నుండి సమావేశానికి విచ్చేసిన ఎమ్మార్పీఎస్‌ నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ ఏ వ్యవస్థ అయినా నిర్మాణం అవసరమని రాష్ట్రస్థాయి నుండి గ్రామస్థాయి వరకు ఎమ్మార్పీఎస్‌ నాయకులు ఎన్నుకోవడం ద్వారానే ఆ సంఘం పటిష్టంగా బలోపేతంగా నిర్మించ బడుతుందని అన్నారు ఎమ్మార్పీఎస్‌ నాయకులు కార్యకర్తలు రాజ్యాధికారం కోసం కృషి చేయాలని అన్నారు .ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు చుంచు ఎర్రబడి కృష్ణన్న, రాయదుర్గం ఈశ్వరయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏసీ వెంకటసుబ్బయ్య, రాజు పండిట్‌ మాల్యాద్రి, మోహన్‌ రాష్ట్ర ఎమ్మారీఎస్‌ న్యాయ వ్యవహారాల కమిటీ అధ్యక్షులు డాక్టర్‌ జి.బాలస్వామి రాయలసీమ జిల్లాల వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మంద కృష్ణయ్య మాదిగ, చిప్తగిరి లక్ష్మీనారాయణ మాదిగ, అనంతపురం జిల్లా హక్కులప్ప మాదిగ, కర్నూలు జిల్లా అధ్యక్షులు గుండు శ్రీనివాస్‌ మాదిగ, కడప జిల్లా సునీల్‌ మాదిగ, నంద్యాల జిల్లా ఇన్‌చార్జ్‌ తిరుపతి మాదిగ సమా వేశంలో ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

 

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎల్‌బీఆర్‌సీఈలో పాఠశాలలు మరియు కళాశాల విద్యాసంస్థల బస్సు డ్రైవర్లకు రిఫ్రెషర్ ట్రైనింగ్ కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక లకిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో రవాణా శాఖ వారి అధ్యర్యంలో విద్యాసంస్థల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *