Breaking News

న్యాయం చేయండి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గన్నవరం బాలుర ఉన్నత పాఠశాలలో గార్డెనర్ గా పనిచేస్తున్న గన్ను మారుతీదేవి గత 17 సంవత్సరాలుగా జిల్లాలోని వివిధ పాఠశాలల్లో పనిచేసింది. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ 2014 సంవత్సరంలో పునాదిపాడు ఉన్నత పాఠశాలలో పనిచేసే సమయంలో అక్కడ ప్రధానోపాధ్యాయులుగా పనిచేసిన ఆర్ విజయరామారావు వివిధ రకాలుగా నన్ను ఇబ్బందులు గురి చేశారు. ప్రధానోపాధ్యాయులైన విజయరామారావు గార్డెనర్ స్థాయిలో ఉన్న నన్ను బెదిరించి భయపెట్టి నా పేరు మీద లోన్ పెట్టి కారు కొనుక్కున్నారు. అలానే 2019 సంవత్సరం లో ఆరు లక్షలు నగదు తీసుకున్నారను తెలిపారు. నాటి నుండి నేటి వరకు నగదును ఎన్ని సార్లు అడిగినా ఇదిగో అదిగో అంటూ కాలయాపన చేస్తున్నారనీ మారుతి దేవి చెప్పారు. మానసికంగా అనేక ఇబ్బందులకు గురి చేశారనీ చెప్పారు. అది కాక పత్రిక విలేకరిని అడ్డుపెట్టుకొని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై నవంబర్ 14న స్పందనలో కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశానని, అలానే పోలీసులకు న్యాయం చేయాలని గన్నవరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన ఫలితం ఏమీ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని సోమవారం నాడు మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ను కలసి వినతి పత్రం అందజేసినట్లు చెప్పారు. విచారించి తగిన న్యాయం చేస్తానని వాసిరెడ్డి పద్మ హామీ ఇచ్చారని తెలియజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎల్‌బీఆర్‌సీఈలో పాఠశాలలు మరియు కళాశాల విద్యాసంస్థల బస్సు డ్రైవర్లకు రిఫ్రెషర్ ట్రైనింగ్ కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక లకిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో రవాణా శాఖ వారి అధ్యర్యంలో విద్యాసంస్థల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *